Orange Cultivation : బత్తాయి తోటల్లో సమగ్ర యాజమాన్యం
ఈ కాలంలో బత్తాయి ధరలు అధికంగా పలుకుతుంటాయి. 6 సంవత్సరాలు దాటిన తోటల నుంచి ఎకరాకు 8 నుండి 10టన్నుల దిగుబడిని సాధించే వీలుంది.

Cultivation Methods
Orange Cultivation : బత్తాయి సాగులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. తెలంగాణలోని నల్గొండ, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, ప్రకాశం, కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఈ తోటలు ఎక్కువగా సాగులో వున్నాయి. బత్తాయికి వేసవిలో మంచి ధర పలుకుతుండటంతో రైతులు వేసవి సమయానికి దిగుబడి వచ్చే విధంగా తోటల్లో యాజమాన్యం చేపడుతుంటారు. అయితే నాణ్యమైన దిగుబడిని పొందాలంటే ఏడాది నీరు, ఎరువులు, సూక్ష్మపోషకాలను సమయానుకూలంగా అందించాల్సి ఉంటుందని రైతులకు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త శ్రవంతి.
READ ALSO : Karnataka : చెప్పులు కుట్టే వ్యక్తికి ప్రధాని మోడీ నుంచి ఆహ్వానం.. ఢిల్లీకి రమ్మంటూ..
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా లో రైతులు బత్తాయి తోటలను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల వాతావరణ అనుకూలతను బట్టి పండ్ల దిగుబడి తీస్తున్నారు. దీనిలో వేసవిలో వచ్చే పంటను చిత్త అని, శీతాకాలపు పంటను ఆరుద్ర అని, వర్షాకాలపు పంటను సీజన్ పంట అని పిలుస్తారు.
READ ALSO : BJP MP Laxman : తెలంగాణలో జనసేనతో కలిసి పోటీ చేసే విషయంలో లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
అయితే నూటికి 80 శాతం మంది రైతులు వేసవి పంట తీసేందుకు మొగ్గుచూపుతారు. ఎందుకంటే ఈ కాలంలో బత్తాయి ధరలు అధికంగా పలుకుతుంటాయి. 6 సంవత్సరాలు దాటిన తోటల నుంచి ఎకరాకు 8 నుండి 10టన్నుల దిగుబడిని సాధించే వీలుంది. ముఖ్యంగా సమయానికి అనుకూలంగా నీటితడులతో పాటు ఏడాదికి రెండు సార్లు ఎరువులను అందించాల్సి ఉంటుందని వివరాలు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త శ్రవంతి.
READ ALSO : Health Tips : ఉబ్బరం, త్రేనుపు,గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమన కోసం !
బత్తాయిలో పూత నుంచి కాయ పక్వానికి రావటానికి దాదాపు 7 నుండి 8 నెలల సమయం పడుతుంది. అయితే ఆశించిన దిగుబడులను పొందాలంటే ఈ తోటలకు పోషకాలను సకాలంలో అందించాలి. మరోవైపు పంట దిగుబడిని బట్టి కొమ్మకత్తిరింపులు చేస్తూ ఉండాలి .