ఏపీలో 53, 724 కరోనా కేసులు..తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 7,232 కేసులు

  • Published By: bheemraj ,Published On : July 21, 2020 / 12:41 AM IST
ఏపీలో 53, 724 కరోనా కేసులు..తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 7,232 కేసులు

Updated On : July 21, 2020 / 6:32 AM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య 50 వేలు దాటింది. మొత్తం 53, 724 మందికి వైరస్ సోకింది. 24 గంటల్లో 4074 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1086 మందికి వైరస్ సోకింది. గుంటూరులో 596, కర్నూలులో 559 మందికి పాజిటివ్ గా తేలింది. నిన్న 5041 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ 4074 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటితో పోల్చితే కొంత మేర తగ్గింది. ఇవాళ వివిధ జిల్లాల్లో 4074 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి ఇంకా కొనసాగుతోంది.తూర్పుగోదావరి జిల్లాలో రికార్డుస్థాయిలో అత్యధికంగా 1086 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 7232 కేసులు ఒకే జిల్లాలో నమోదయ్యాయి. ఈ ఒక్క జిల్లాలోనే ఇప్పటివరకు 65 మంది చనిపోయారు.

33 వేల 580 శాంపిల్స్ తీయగా దాంట్లో 4774 కేసులు పాజిటివ్ కేసులు ఉన్నట్లుగా వైద్య
ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఒక్క రోజు తూర్పుగోదావరి 9, గుంటూరులో 9, కృష్ణాలో 7, అనంతపురం 6, చిత్తూరులో 5, శ్రీకాకుళం 5, విశాఖ 5 మంది చొప్పున మృతి చెందారు. 28 వేల 800 మంది కరోనా బారిన పడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.

గడిచిన 24 గంటల్లోనే జిల్లాలో 354 కేసులు నమోదయ్యయి. రాష్ట్రం మొత్తంగా చూసినట్లైతే సమాహిక వ్యాప్తి అనేది పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అత్యధికంగా నమోదవ్వడం ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. ప్రజలు భౌతికదూరాన్ని విస్మరిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో మాస్కులు ధరించడం లేదు. అందువల్లనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్పవచ్చు.

ఏపీలో కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.