ఏపీపై కరోనా పంజా…80,858 పాజిటివ్ కేసులు.. 933 మంది మృతి

ఏపీపై కరోనా మరోసారి పంజా విసిరింది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 48,114 శాంపిల్స్ ని పరీక్షించగా 8,147 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ చేశారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 80,858కు చేరింది. కరోనాతో ఇవాళ 49 మంది చనిపోయారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 933 మంది మృతి చెందారు. 2,380 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 15,41,993 శాంపిల్స్ ను పరీక్షించారు. రాష్ట్రంలో 39,990 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 39,935 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1029 కేసులు నమోదయ్యాయి. అనంతపురం 984, కర్నూలు 914, విశాఖ 898, పశ్చిమగోదావరి 807, గుంటూరు 703, చిత్తూరు 630, కడప 494, శ్రీకాకుళం 374, కృష్ణా 359, విజయనగరం 322, ప్రకాశం 355, నెల్లూరు 278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తూర్పుగోదావరి 11, కృష్ణా 9, కర్నూలు 8, శ్రీకాకుళం 7, పశ్చిమ గోదావరి 5, గుటూరు 3, విశాఖపట్నం 3, చిత్తూరు 1, ప్రకాశం 1, విజయనగరం 1 చొప్పున మృతి చెందారు.