Tiger Nandyala : నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో కనిపించిన పెద్దపులి

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో పెద్దపులి కనిపించింది. కొత్తపల్లి మండలంలో ముసలిమడుగు గ్రామ అడవి సమీపంలోని అడవి ముక్కల దగ్గర పెద్దపులి తారసపడింది. అటవీ ప్రాంతంలో పెద్దపులి రోడ్డు దాటుతుండగా గొర్రెల కాపరులు, వాహన దారులు చూశారు.

Tiger Nandyala : నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో కనిపించిన పెద్దపులి

Leopard footprints

Updated On : March 8, 2023 / 8:29 PM IST

Tiger Nandyala : నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో పెద్దపులి కనిపించింది. కొత్తపల్లి మండలంలో ముసలిమడుగు గ్రామ అడవి సమీపంలోని అడవి ముక్కల దగ్గర పెద్దపులి తారసపడింది. అటవీ ప్రాంతంలో పెద్దపులి రోడ్డు దాటుతుండగా గొర్రెల కాపరులు, వాహన దారులు చూశారు. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు ఘటనా స్థలికి బయలుదేరారు. పెద్దపులి పాద ముద్రలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ట్రాప్ కెమెరాలో పెద్దపులి ట్రేస్ అయింది.

తారసపడ్డ పెద్దపులి ఆడపులిగా అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు పులి కూనల తల్లో కాదో అని అటవీ సిబ్బంది పరిశీలిస్తున్నారు. పాదముద్రల ఆధారంగా తల్లి పులి T 108 అయి ఉండవచ్చునని అడవి శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఓ పెద్దపులి అడుగు జాడలను అటవీశాఖ సిబ్బంది గుర్తించింది. ఆ ముద్రలు T108 పులివా కాదా అనేది తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా కనిపించిన పులి.. T108 పులా కాదా అన్న విషయం తేలాల్సివుంది.

Andhra Pradesh: కొత్తపల్లి మండలంలో కనిపించిన పెద్దపులి పిల్లలు.. జాడ లేని తల్లి పులి.. ఆందోళనలో గ్రామస్తులు

మరోవైపు నంద్యాల జిల్లాలో ఫారెస్ట్ అధికారుల ఆపరేషన్ ‘తల్లి పులి’ కొనసాగుతోంది. తల్లి పులి జాడ కోసం అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. తల్లి పులి నెంబర్ T-108 గా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పిల్లలకు దూరమైన తల్లి పులి ప్రవర్తనను అంచనా వేయలేమన్న అటవీ అధికారులు.. ఒకేసారి పులి నాలుగు పిల్లలకు జన్మనివ్వడం చాలా అరుదు అని చెప్పారు. అందులోనూ నాలుగు కూడా ఆడ పులి పిల్లలు కావడం అత్యంత అరుదు అన్నారు.

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామ శివారులో పులి పిల్లలు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. తల్లి నుంచి విడిపోయి దారితప్పిన నాలుగు పెద్ద పులి పిల్లలు గ్రామంలోకి వచ్చాయి. కుక్కలు వాటిని చంపేస్తాయనే భయంతో గ్రామస్తులు పులి పిల్లలను తీసుకెళ్లి ఓ గదిలో ఉంచి సంరక్షించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పులి పిల్లలను పరిశీలించారు.

Tiger Cubs Found At Nandyal : అటవీ అధికారులకు పులి కూనల టెన్షన్

తల్లి నుంచి విడిపోయి చాలా సమయం కావడంతో పాలు అందక బాగా నీరసించిపోయినట్టు గుర్తించారు. వాటి ముందు సెరెలాక్, పాలు వంటి వాటిని పెట్టినా అవి ముట్టలేదు. అధికారులు వాటిని బైర్లూటి వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. పులి కూనలన్నీ ఆడవేనని, ఒకేసారి నాలుగు ఆడ పిల్లలకు జన్మనివ్వడం అరుదని అధికారులు తెలిపారు. కాగా, పులి పిల్లలు గ్రామంలోకి వచ్చాయంటే వాటి తల్లి సమీపంలోనే ఉంటుందని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.