Chandrababu : చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్.. హైకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్

Chandrababu Regular Bail Petition : మూడు 10 రూపాయలు నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలను చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్ తరలించారని, బోస్ అనే వ్యక్తి ఫోన్ మెసేజ్ ల ద్వారా ఈ విషయం బయటపడిందని ఆయన తెలిపారు.

Chandrababu : చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్.. హైకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్

Chandrababu Naidu Regular Bail Petition

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. చంద్రబాబువి తప్పుడు హెల్త్ రిపోర్టులు అని పొన్నవోలు వాదించగా, అందుకు తీవ్ర అభ్యంతరం తెలిపారు చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా. ఇవాళ బెయిల్ పిటిషన్ పై వాడీవేడిగా వాదనలు సాగాయి.

చంద్రబాబు హెల్త్ రిపోర్టులన్నీ అబద్దం- ఏఏజీ పొన్నవోలు
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు రెగులర్ బెయిల్ పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు ముగిశాయి. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చాలా సీరియస్ కామెంట్స్ చేశారాయన. చంద్రబాబు ఆరోగ్య రిపోర్టులన్నీ తప్పుడివి అని పొన్నవోలు చెప్పారు. మూడు 10 రూపాయలు నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలను చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్ తరలించారని, బోస్ అనే వ్యక్తి ఫోన్ మెసేజ్ ల ద్వారా ఈ విషయం బయటపడిందని ఆయన తెలిపారు.

Also Read : ప్రజాధనం మింగేసి జైలుకెళ్లిన దొంగ నేడు పాలన చేస్తున్నారు : అశోక్ గజపతి రాజు

”బోస్, కన్వేల్కర్ మేసేజ్ ల ఆధారంగా మొత్తం డబ్బు హైదరాబాద్ చేరినట్లుగా తెలిసింది. సెమెన్స్ వాళ్లే నిధుల మళ్లింపు జరిగిందని నిర్ధారించారు. ఈ ప్రాజెక్ట్ కు ఎవరైనా అభ్యంతరం చెబితే 24 గంటల్లోగా ట్రాన్స్ ఫర్ చేస్తామని చీఫ్ సెక్రటరీ హామీ ఇచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఆ విధంగా వ్యవహరించారు. చీఫ్ సెక్రటరీ తన లెటర్ లో సీఎం గారు 270 కోట్లు విడుదల చేయమని చెప్పారు అని ఫైనాన్స్ సెక్రటరీకి లేఖ రాశారు” అని వాదనలు వినిపించారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి.

పొన్నవోలు వాదనలపై లూథ్రా తీవ్ర అభ్యంతరం..
వర్చువల్ లో తన వాదనలు వినిపించారు చంద్రబాబు తరపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది లూథ్రా. ఇవాళ్టి విచారణలో ఏఏజీ పొన్నవోలు, లూథ్రా మధ్య హోరాహోరీగా వాదనలు సాగాయి. చంద్రబాబు హెల్త్ రిపోర్టులు తప్పుడివి అంటూ ఏఏజీ పొన్నవోలు చేసిన వాదనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు లూథ్రా.

చంద్రబాబుకి బెయిల్ ఇవ్వొద్దు-ఏఏజీ పొన్నవోలు
”తెలుగుదేశం, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్.. రెండింటికి ఒక్కరే ఆడిటర్. వికాస్ కన్వేల్కర్ (A8).. సీమెన్స్ కంపెనీ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించిన శరత్ అసోసియేట్స్ అనే ఛార్టర్డ్ అకౌంటెంట్ కంపెనీని బెదిరించారు. చంద్రబాబు బెయిల్ కండీషన్స్ ఉల్లఘించి ర్యాలీలు నిర్వహించారు. అందుకుగాను తెలంగాణ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అవినీతి, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసుల్లో బెయిల్ యధాలాపంగా ఇవ్వకూడదని సుప్రీం కోర్టు పలు జడ్జిమెంట్స్ లో పేర్కొనడం జరిగింది.

Also Read : ఏపీ ప్రభుత్వంపై పురందేశ్వరి మరోసారి ఘాటు విమర్శలు .. సమాధానం చెప్పాలంటూ డిమాండ్

ఇవి కాకుండా చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. కాబట్టి బెయిల్ ఇవ్వటానికి వీల్లేదు. అవినీతి అక్రమాలు చేసే వారు ఎవరైనా సరే వారిని చట్టం వదిలిపెట్టదు అనేది సమాజానికి దీని ద్వారా ఒక మెసేజ్ వెళ్ళాలి. అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వకూడదు. ఇదివరకే మిగతా వాళ్ళకి బెయిల్ ఇచ్చారు కాబట్టి నాకు కూడా బెయిల్ ఇవ్వండని అడగడానికి వీల్లేదు. దీనిలో చంద్రబాబు ప్రధాన ముద్దాయి” అని వాదనలు వినిపించారు పొన్నవోలు.

సరిగ్గా ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయడం ఎందుకు?- లూథ్రా
చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్ధ లూథ్రా సైతం వాడీవేడిగా వాదనలు వినిపించారు. ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబుని అరెస్ట్ చేశారు. బెయిల్ పై విచారణ జరిపేటప్పుడు కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. 2018 నుండి విచారణ జరుగుతుంటే ఇప్పుడు హడావుడిగా విచారణ చేయాల్సిన అవసరం ఏముంది? ఇదే ఫైనాన్స్ సెక్రటరీ కె సునీత.. గుజరాత్, అహ్మదాబాద్ వెళ్లి ఈ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అద్భుతం అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఆమెనే వీళ్ళు సాక్షిగా పేర్కొన్నారు.

Also Read : నాది, పవన్ కళ్యాణ్ ది ఒకటే భావజాలం.. దేనికీ భయపడని వ్యక్తిత్వం : ఎమ్మెల్యే బాలకృష్ణ

ఇది కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యే- లూథ్రా
చంద్రబాబు గుండె, చర్మ సంబంధిత సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని సంవత్సరాల విచారణ తర్వాత కూడా ఆయనను జైల్లో ఉంచాల్సిన అవసరం ఏముంది? అది కూడా అందరూ బెయిల్ లో ఉన్న తరువాత. ఇది రాజకీయ కక్ష సాధింపే. సీమెన్స్ ఫోరెన్సిక్ ఆడిట్ లోనే మేము అంతా వెరిఫై చేయలేదని రాయబడింది. ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ చంద్రబాబును ఇరికించడం కోసం తయారు చేయబడింది. ఫీల్డ్ వెరిఫికేషన్ చేయలేదని ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన వారే రిపోర్టు చెప్పారు” అని సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు.

కీలకంగా మారిన చంద్రబాబు హెల్త్ రిపోర్టు..
అటు, నిన్నటి విచారణలోనూ చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది సీఐడీ. ఈ రెగులర్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ(నవంబర్ 16) మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణలో చంద్రబాబు లాయర్లు కోర్టుకు సమర్పించిన బాబు హెల్త్ రిపోర్టు కీలకంగా మారింది. ఇప్పటికే చంద్రబాబు హెల్త్ రిపోర్టును మెమో రూపంలో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టుకు అందించారు. కంటి ఆపరేషన్, హెల్త్ కండీషన్ వివరాలకు సంబంధించిన నివేదికను సమర్పించారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చంద్రబాబు తీసుకుంటున్న చికిత్స వివరాలను అందులో పొందుపరిచారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలకు సంబంధించి సమస్యలు ఉన్నాయని, కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలిపారు.