Ashok Gajapathi Raju : ప్రజాధనం మింగేసి జైలుకెళ్లిన దొంగ నేడు పాలన చేస్తున్నారు : అశోక్ గజపతి రాజు

చంద్రబాబుని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారని తెలిపారు. చంద్రబాబును ఇంకా జైల్లో పెట్టి హింసించాలని చూస్తున్నారని ఆరోపించారు. కనీస సదుపాయాలు చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.

Ashok Gajapathi Raju : ప్రజాధనం మింగేసి జైలుకెళ్లిన దొంగ నేడు పాలన చేస్తున్నారు : అశోక్ గజపతి రాజు

Ashok Gajapathi Raju

Updated On : November 16, 2023 / 4:30 PM IST

Ashok Gajapathi Raju – CM Jagan : సీఎం జగన్ పై మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనను ఎండగట్టారు. రాష్ట్రంలో సీఎం జగన్ అధికార దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ పార్టీ చేస్తున్న ఏ కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వడం లేదన్నారు. ప్రజాధనాన్ని మింగేసి జైలుకు వెళ్లిన దొంగ నేడు పాలన చేస్తున్నారని ఆరోపించారు. అలాంటివారికి బెదిరింపుల మనస్తత్వం కాకుండా వేరే ఏమి ఉంటుందని అన్నారు.

రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు ఉన్నారా లేరా అనే సందేహం కలుగుతోందని అన్నారు. రాష్ట్ర ప్రజా ప్రతినిధుల్లో వెన్నుముక్క లేకుండా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విషయం అడిగే ధైర్యం కూడా ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఈ మేరకు ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. అధికారులు వారి కనీస బాధ్యతలు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు.

RS Praveen Kumar : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశం

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన హక్కుల కోసం పదవులు కూడా వదులుకున్నామని తెలిపారు. కానీ, ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన డబ్బులను కూడా వేరే వాటికి బదిలీ చేసి లబ్ధిదారులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. సుప్రీంకోర్టు వివరాలు అడిగి చివాట్లు కూడా పెట్టిందని పేర్కొన్నారు.

చంద్రబాబుని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారని తెలిపారు. చంద్రబాబును ఇంకా జైల్లో పెట్టి హింసించాలని చూస్తున్నారని ఆరోపించారు. కనీస సదుపాయాలు చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. హైకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.

KTR : 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటేయాలి : కేటీఆర్

టీడీపీ, జనసేన కలసి ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు లాంటి మంచి వ్యక్తిని ప్రజలు ఎన్నుకోవాలని కోరుతున్నానని చెప్పారు. భావితరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు. మళ్ళీ దొంగని ప్రోత్సాహితే రాష్ట్రం నాశనం అయిపోతుందన్నారు.