Atchannaidu : సీఎం జ‌గ‌న్‌కు అచ్చెన్నాయుడు స‌వాల్‌..

Kinjarapu Atchannaidu : సీఎం జ‌గ‌న్ పై ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు విరుచుకుప‌డ్డారు.

Atchannaidu : సీఎం జ‌గ‌న్‌కు అచ్చెన్నాయుడు స‌వాల్‌..

Achchennaidu

సీఎం జ‌గ‌న్ పై ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు విరుచుకుప‌డ్డారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన‌ మీడియాలో స‌మావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 2004లో వైఎస్సార్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జ‌గ‌న్ ల‌క్ష కోట్ల ఆదాయాన్ని సంపాదించార‌ని ఆరోపించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి సీఎంగా బాధ్య‌త‌లు స్వీకరించిన నాటి నుంచి జ‌గ‌న్ సీబీఐ వాయిదాల‌కు హాజ‌రు కావ‌డం లేద‌న్నారు.

జగన్మోహన్ రెడ్డి పై క్విడ్‌ప్రోకో కింద సీబీఐ 11 కేసులు న‌మోదు చేసింద‌న్నారు. అవినీతి సొమ్ముతో పేపర్లు ,సిమెంట్ కంపెనీలు పెట్టుకున్నార‌ని ఆరోపించారు. అచ‌ర‌ణ సాధ్యం కాని హామీలు ఇచ్చి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చార‌ని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇప్ప‌టి వ‌ర‌కు రూ.4ల‌క్ష‌ల కోట్ల ప్ర‌జాధ‌నాన్ని కొల్లగొట్టార‌న్నారు. రాష్ట్రంలో క‌నీస అభివృద్ధి లేద‌ని, అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని య‌ధేచ్చ‌గా అవినీతికి పాల్ప‌డ్డార‌న్నారు.

vellampalli Srinivasa Rao: చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి ఛాలెంజ్

మీ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎంపీనే మీ అవినీతి పై విచారణ జరపాలంటూ కోర్టును ఆశ్రయించారు. ప‌దేళ్లుగా బెయిల్ పై ఉన్నార‌ని, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత 341 సార్లు కేసుల్లో వాయిదా కోరి న్యాయ‌స్థానానికి వెళ్ల‌కుండా మోసం చేశార‌న్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో న్యాయ సమీక్ష చేయించాలి. లక్ష కోట్ల అవినీతి జరిగిందని తాము చెప్పిన కూడా ఒక్క రోజు ఈ విష‌యమై మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడ‌లేద‌న్నారు. అవినీతిపై కోర్టులో వేసిన నోటీసు పై వెంటనే జ‌గ‌న్ విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాలని ఛాలెంజ్ చేస్తున్న‌ట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.