తిరుమలలో తొక్కిసలాట ఘటనను అలా భావించడం ప్రమాదకరం.. ప్రజలు క్షమించరు: అంబటి రాంబాబు
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం జగన్ వెళ్లి పరామర్శించి వచ్చారని గుర్తుచేశారు.

తిరుమలలో తొక్కిసలాటలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోవడం చిన్న విషయంగా భావించకూడదని చెప్పారు. అలా భావించడం ప్రమాదకరమని, ప్రజలు క్షమించరని అన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం జగన్ వెళ్లి పరామర్శించి వచ్చారని గుర్తుచేశారు. డీఎస్పీని, గోశాల ఇన్‌చార్జిను సస్పెండ్ చేశారని తెలిపారు. చంద్రబాబు నిజమైన చర్యలు తీసుకోలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం ఒకేసారి పరామర్శకు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు.
జగన్మోహన్ రెడ్డిని రాకుండా అడ్డుకునేందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఛైర్మన్, ఈవో, పోలీస్ హెడ్ పై చర్యలు తీసుకోకుండా ఎస్పీని మాత్రమే బదిలీ చేశారని అన్నారు.
వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడానికే ముఖ్యమైన పోస్టుల్లో తనవారిని చంద్రబాబు నియమించుకున్నారని ఆరోపించారు. తిరుమల ఘటనకు ఛైర్మన్, ఈవో, జేఈవో బాధ్యులని పవన్ ప్రకటించారని అన్నారు. ఇప్పటికే తిరుపతి ప్రతిష్ఠను దిగజార్చారని, దైవాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పారు.
Hydra Demolitions : హైదరాబాద్ మణికొండలో హైడ్రా కూల్చివేతలు.. ఆ విల్లాలు నేలమట్టం..