Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్‌ కల్యాణ్.. అంతేకాదు..

ఎన్నికల ఫలితాలను బట్టి ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తామని అన్నారు.

Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్‌ కల్యాణ్.. అంతేకాదు..

Pawan Kalyan

Pawan Kalyan – NDA: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల (Lok sabha election 2024)కు సిద్ధమవుతున్న బీజేపీ (BJP) ఇవాళ సాయంత్రం ఎన్డీఏ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జనసేన తరఫున ఇందులో పాల్గొనడానికి పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఉన్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని తెలిపారు. ఎన్నికల ఫలితాలను బట్టి ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది ముఖ్యం కాదని చెప్పారు. అయితే, తాను సీఎం అభ్యర్థిగా ఉండాలని జనసేన క్యాడర్ కోరిక అని తెలిపారు.

రాష్ట్రానికి, తమకు అండగా నిలిచేవారే అధికారంలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని పవన్ కల్యాణ్ చెప్పారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు అందరూ కలిసి పోరాడాలని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనేదే తన అభిప్రాయమని పవన్ చెప్పారు. బీజేపీ, టీడీపీకి మధ్య కొన్ని అవగాహనాలోపాలు ఉన్నాయని తెలిపారు. 2014లో మూడు పార్టీలు కలిసే ఉన్నాయని, 2019లో విడిపోయామని చెప్పారు.

కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, పార్టీల మధ్య ఐక్యతపై కూడా ఎన్డీఎ సమావేశంలో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కూడా ప్రస్తావించే అవకాశం ఉందని ఇప్పటికే పవన్ కల్యాణ్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ ఏదీ లేదు.

KA Paul: జూనియర్ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రాకుండా వారు ఇలా చేస్తున్నారు: కేఏ పాల్