andhrapradesh covid 19 : పెరుగుతున్న కరోనా కేసులు, 24 గంటల్లో 380 కేసులు..204 మంది డిశ్చార్జ్

ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 380 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

andhrapradesh covid 19 : పెరుగుతున్న కరోనా కేసులు, 24 గంటల్లో 380 కేసులు..204 మంది డిశ్చార్జ్

Andhra Pradesh Corona

Updated On : March 20, 2021 / 7:15 PM IST

covid 19 : ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 380 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 204 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కొవిడ్‌ పాజిటివ్‌ కేసు సంఖ్య 8,93,3669కి చేరాయి. మొత్తం 8,84,094 మంది చికిత్స నుంచి కోలుకున్నారు. మరో 2083 యాక్టివ్‌ కేసులుండగా.. 7189 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 2021, మార్చి 20వ తేదీ శనివారం 30 వేల 978 శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు 1,47,05,188 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2 వేల 083గా ఉంది.

జిల్లాల వారీగా కేసులు : –
అనంతపురం 22. చిత్తూరు 60. ఈస్ట్ గోదావరి 26. గుంటూరు 70. వైఎస్సార్ కడప 08. కృష్ణా 44. కర్నూలు 51. నెల్లూరు 21. ప్రకాశం 06. శ్రీకాకుళం 15. విశాఖ పట్టణం 43. విజయనగరం 09. వెస్ట్ గోదావరి 05. మొత్తం 380.