AP : 24 గంటల్లో 147 కరోనా కేసులు, 103 మంది డిశ్చార్జ్

రాష్ట్రంలో గత 24 గంటల్లో 22 వేల 604 మంది శాంపిల్స్ పరీక్షించగా..14 మంది కోవిడ్ - 19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

AP : 24 గంటల్లో 147 కరోనా కేసులు, 103 మంది డిశ్చార్జ్

COVID-19 cases

Updated On : March 15, 2021 / 5:27 PM IST

Andhrapradesh Covid 19 : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. తొలుత వేయిల సంఖ్యలో నమోదైన కేసులు ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 22 వేల 604 మంది శాంపిల్స్ పరీక్షించగా..14 మంది కోవిడ్ – 19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కోవిడ్ వల్ల కర్నూలులో ఒకరు చనిపోయారని, గత 24 గంటల్లో 103 మంది కోవిడ్ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలిపింది. మొత్తంగా రాష్ట్రంలో 1,45,57,366 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.

జిల్లాల వారీగా కేసులు : –

అనంతపురం 09. చిత్తూరు 35. ఈస్ట్ గోదావరి 31. గుంటూరు 21. వైఎస్సార్ కడప 09. కృష్ణా 09. కర్నూలు 04. నెల్లూరు 09. ప్రకాశం 01. శ్రీకాకుళం 10. విశాఖ పట్టణం 07. విజయనగరం 01. వెస్ట్ గోదావరి 01. మొత్తం 147.
ప్రస్తుతం రాష్ట్రంలో 1443 యాక్టివ్ కేసులు ఉండగా..8 లక్షల 83 వేల 380 మంది కోలుకున్నారు. మొత్తం కరోనా వైరస్ బారిన పడి 7 వేల 185 మంది చనిపోయారు.