AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పేదల గృహ రుణాలకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ ప్రభుత్వాల హయాంలో హౌజింగ్ కార్పొరేషన్ నుంచి లోన్లు తీసుకున్న పేదలకు ఊరట కలిగించేందుకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ సౌకర్యం తీసుకొచ్చింది.

Ap Cabinet (1)
AP Cabinet Key decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ ప్రభుత్వాల హయాంలో హౌజింగ్ కార్పొరేషన్ నుంచి లోన్లు తీసుకున్న పేద వర్గాలకు ఊరట కలిగించేందుకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ సౌకర్యం తీసుకొచ్చింది. పేదల గృహ రుణాలపై వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్ని నాని అన్నారు. 1983 సం. నుంచి 2011 ఆగస్టు 15 మధ్య వివిధ ప్రభుత్వాల ద్వారా పొందిన ఇంటి స్థలాలపై తీసుకున్న లోన్లను సెటిల్‌మెంట్ చేసుకోవచ్చని చెప్పారు.
వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా 46 లక్షల 61 వేల 737 మంది లబ్ధి పొందనున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేల వన్‌టైమ్ సెటిల్‌మెంట్ సౌకర్యం పొందవచ్చని చెప్పారు. మున్సిపాలిటీల్లో 15 వేలు, కార్పొరేషన్ల పరిధిలోని 20 వేలు చెల్లించి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసుకోవచ్చని తెలిపారు.
AP : బుల్లెట్ బండి పాటకు ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి డ్యాన్స్
ఎన్నో ప్రాణాలు గాల్లో కలిపేసిన.. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌పై కఠిన చర్యలకు పచ్చజెండా ఊపింది. ఎల్జీ పాలిమర్స్ సంస్థ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పర్యావరణ అనుకూల, ప్రమాద రహిత పరిశ్రమ ఏర్పాటుకు ఎల్జీ పాలిమర్స్‌కు అనుమతి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
మైనారిటీ సబ్ ప్లాన్‌కు ఏపీ కెబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నియామకంలో చట్ట సవరణ చేయాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది. కేంద్రంతో కలిసి 10 వేల మెగా వాట్ల సౌర విద్యుత్ పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Government Orders : ఏపీ ప్రభుత్వ జీవోలకు ‘ఈ-గెజిట్’
వ్యవసాయ వినియోగానికే 10 వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్ కేటాయించింది. యూనిట్ రూ.2.49కు సరఫరా చేసేలా కెబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్ అండ్ బీ ఖాళీ స్థలాలు, భవనాలు ఆర్డీసీకి బదలాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.