AP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. ఇవాళే నిధులు విడుదల..

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ..

AP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. ఇవాళే నిధులు విడుదల..

Chandrababu Naidu

Updated On : March 21, 2025 / 8:36 AM IST

AP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు రూ. 6,200 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో  సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఎఐ కింద రూ. 6,200 కోట్లను ఆర్థిక శాఖ ఇవాళ విడుదల చేయనుంది.

Also Read: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులపై సంతకం

ప్రభుత్వానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది జనవరి 11న ఉద్యోగుల వివిధ బకాయిల కింద రూ. 1033 కోట్లు విడుదల చేయడం జరిగిందని, తాజాగా.. ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవటం జరిగిందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.