CM Jagan Tirumala Tour: 27న తిరుమలకు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఈ నెల 27న తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ..

CM Jagan Tirumala Tour: 27న తిరుమలకు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి

CM Jagan Tirumala Tour

Updated On : September 11, 2022 / 2:06 PM IST

CM Jagan Tirumala Tour: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఈ నెల 27న తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 27న రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. 27న రాత్రి 7గంటలకు సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనసేవల్లో పాల్గొంటారని తెలిపారు.

CM YS Jagan: టార్గెట్ కుప్పం.. 22న చంద్రబాబు అడ్డాలో సీఎం జగన్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

ఈనెల 28వ తేదీన ఉదయం పరకామణి నూతన భవనాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ప్రారంభించనున్నారు. అధునాతన సౌకర్యాలు, పటిష్టమైన భద్రతతో మొత్తం 26 కోట్లతో పరకామణి భవనం నిర్మిస్తున్నారు. ఈ భవనంలో కానుకల లెక్కింపును భక్తులు వీక్షించేందుకు రెండువైపులా అద్దాలు ఏర్పాటు చేశామని ఈవో ధర్మారెడ్డి అన్నారు. 2.5 కోట్లు విలువ గల చిల్లర నాణేలు వేరు చేసే యంత్రాన్ని దాత విరాళమిస్తున్నారని. ఈ యంత్రం ద్వారా 13 రకాల నాణేలను యంత్రం సెగ్రిగేషన్ చేయవచ్చని తెలిపారు. శ్రీవారి ఆలయం వెలుపల నూతన పరకామణి వాడుకలోకి వచ్చిన అనంతరం.. ఆలయంలోని పాత పరకామణిలో లెక్కింపు నిలిపివేస్తామని చెప్పారు.