Andhra Pradesh Covid : రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆసుపత్రులకు భూములు కేటాయింపు

ఏపీ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఉధృతి క్రమంలో మరింత వైద్య రంగాన్ని బలపర్చాలని ఆయన భావిస్తున్నారు.

Andhra Pradesh Covid : రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆసుపత్రులకు భూములు కేటాయింపు

Ap Cm Jagan

Updated On : May 28, 2021 / 6:51 PM IST

CM YS Jagan Mohan Reddy : ఏపీ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఉధృతి క్రమంలో మరింత వైద్య రంగాన్ని బలపర్చాలని ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగా..కీలకి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు కీలక సూచనలు చేశారు. 2021, మే 28వ తేదీ శుక్రవారం కోవిడ్ పరిస్థితిపై సమీక్షించారు. ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలు, పరిష్కారం, మందులు, ఆక్సిజన్ సరఫరా, కర్ఫ్యూ పొడిగింపు తదితర వాటిపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు.

రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్ హబ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రాలతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రిలో హెల్త్ హబ్ లు ఉండాలన్నారు. ఈ హబ్ ల ఏర్పాటు కోసం 30 నుంచి 50 ఎకరాల భూ సేకరణ జరపాలని, ఒక్కో ఆసుపత్రికి 5 ఎకరాలు చొప్పున కేటాయించాలన్నారు. అయితే…మూడు సంవత్సరాల్లో రూ. 100 కోట్లు పెట్టే ఆసుపత్రులకు భూ కేటాయింపులు చేయాలని, నెల రోజుల్లో కొత్త పాలసీ తీసుకరావాలని సీఎం జగన్ ఆదేశించారు.

అత్యాధునిక వైద్యం కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ తయారయ్యేలా ఒక విధానం తీసుకురావాలని సీఎం జగన్‌ సూచించారు.

Read More : NBK Seva Samithi : యన్.బి.కె సేవా సమితి కరోనా మెడికల్ కిట్స్ పంపిణీ..