AP Covid Cases : ఏపీలో కొత్తగా 10,373 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా కేసులు క్రమేపి తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,373 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది.

AP Covid Cases : ఏపీలో కొత్తగా 10,373 కరోనా పాజిటివ్ కేసులు

Ap Corona Cases Update

Updated On : June 5, 2021 / 6:18 PM IST

AP Covid Cases :  ఏపీలో కరోనా కేసులు క్రమేపి తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,373 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 88, 441 శాంపిల్స్ ను పరీక్షించామని దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 1,97,08,031 కి చేరిందని తెలిపింది.

కోవిడ్ వల్ల గడిచిన 24 గంటల్లో 80 మంది మరణించారు. ఇంతవరకు మరణించిన వారి సంఖ్య 11, 376 కి చేరింది. రాష్ట్రంలో గత 24 గంటల్లోల 15,958 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,28,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్టంలో కోటి ఆరులక్షల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ వేశామని, 45 ఏళ్లు దాటిన వారిలో 50 శాతం మందికి మొదటి డోసు వేశామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.