AP Covid : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, కొత్తగా ఎన్నంటే..
రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఎక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో

Ap Covid
AP Covid : రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. నిన్నటితో(2వేల 672 కేసులు) పోలిస్తే ఇవాళ ఎక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,05,024 మంది నమూనాలు పరీక్షించగా 2వేల 974 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 17 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 3వేల 290 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24వేల 708 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనాతో ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో కొత్తగా నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 577, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 33 కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు రాష్ట్రంలో 18,99,361 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు మహమ్మారి బారినపడి మొత్తం 13,132 మంది ప్రాణాలు వదిలారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,35,93,055 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
జిల్లాల వారిగా కరోనా కేసుల వివరాలు.. అనంతపురం జిల్లాలో 98, చిత్తూరు జిల్లాలో 501, తూర్పుగోదావరి జిల్లాలో 577, గుంటూరు జిల్లాలో 179, కడప జిల్లాలో 106, క్రిష్ణా జిల్లాలో 311, కర్నూలు జిల్లాలో 65, నెల్లూరు జిల్లాలో 282, ప్రకాశం జిల్లాలో 349, శ్రీకాకుళం జిల్లాలో 73, విశాఖపట్నం జిల్లాలో 120, విజయనగరం జిల్లాలో 33, పశ్చిమగోదావరి జిల్లాలో 280 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
#COVIDUpdates: 18/07/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,37,201 పాజిటివ్ కేసు లకు గాను
*18,99,361 మంది డిశ్చార్జ్ కాగా
*13,132 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 24,708#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/DR73UmLgsV— ArogyaAndhra (@ArogyaAndhra) July 18, 2021