Diwali రోజున ఆ 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చాలి
దీపావళి పండుగ వచ్చేస్తోంది. దీపావళి పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది దీపాలు. ఆ తర్వాత టపాసులు. ఆ పండుగ రోజున దేశవ్యాప్తంగా క్రాకర్స్ కాలుస్తారు. చిన్న, పెద్ద అనే తేడా లేదు.

Diwali Crackers
Diwali : దీపావళి పండుగ వచ్చేస్తోంది. దీపావళి పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది దీపాలు. ఆ తర్వాత టపాసులు. ఆ పండుగ రోజున దేశవ్యాప్తంగా క్రాకర్స్ కాలుస్తారు. చిన్న, పెద్ద అనే తేడా లేదు. అందరూ పటాసులు కాల్చి ఎంజాయ్ చేస్తారు. ఈసారి క్రాకర్స్ కాల్చేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు.
Disease Attack : యువతపై జబ్బుల దాడి… చిన్న వయస్సులోనే మరణం అంచులకు..
అయితే ఏపీలో దీపావలి రోజున క్రాకర్స్ కాల్చడంపై ఆంక్షలు పెట్టారు. దీవాళి రోజున రెండు గంటలు మాత్రమే అంటే రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య టపాసులు కాల్చాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ అశ్విని కుమార్ తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలెవరూ మామూలు టపాసులు కాల్చొద్దని కోరారు. దీని వల్ల వాయు, శబ్ద కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. బదులుగా గ్రీన్ కాకర్స్ తోనే పండుగ చేసుకోవాలని సూచించారు.
కాగా, దీపావళి రోజు వాడే ఫైర్‌క్రాకర్స్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశంలో అన్ని రకాల బాణసంచాపై తాము పూర్తి నిషేధం విధించలేదని క్లారిటీ ఇచ్చింది. అయితే బేరియం సాల్ట్ ఉపయోగించిన క్రాకర్స్‌పై మాత్రమే నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. వేడుకల పేరుతో ఇతరుల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, పిల్లల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అలాగే పర్యావరణానికి హానికరమైన బాణాసంచా కాల్చడానికి వీల్లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రాలు, ఏజెన్సీలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటించాలని, అతిక్రమిస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
Covid-19 Origins : కొవిడ్ పుట్టుక.. వైరస్ మూలాలను ఎప్పటికీ గుర్తించలేం.. జీవాయుధం కానేకాదు!
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే అధికారం ఎవరికీ లేదని సుప్రీం తేల్చి చెప్పింది. హరిత టపాసులకు(గ్రీన్ కాకర్స్) ఎలాంటి అభ్యంతరం లేదంది. కాలుష్య కారక బాణసంచా ఉపయోగించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సుప్రీం కోర్టు సూచించింది.