ఏపీలో స్కూల్ యూనిఫాం రంగు మారింది : గులాబీ రంగు డ్రెస్

ఏపీ రాష్ట్రంలో విద్యా సంస్కరణలపై సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రికరించారు. ఇప్పటికే నాడు - నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ

ఏపీలో స్కూల్ యూనిఫాం రంగు మారింది : గులాబీ రంగు డ్రెస్

Updated On : January 20, 2022 / 5:39 PM IST

ఏపీ రాష్ట్రంలో విద్యా సంస్కరణలపై సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రికరించారు. ఇప్పటికే నాడు – నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల యూనిఫాం రంగులను మార్చివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల యూనిఫాం కలర్ మార్చనున్నట్లు ఏపీ విద్యా శాఖ 2020, ఏప్రిల్ 27వ తేదీ సోమవారం వెల్లడించింది.

ఇప్పటి వరకు తెలుపు, నీలం, ముదురు నీలం రంగులు బట్టలు ఇస్తున్నారు. ఇక నుంచి గులాబీ రంగు దస్తులు ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. 6 నుంచి 10 వ తరగతి వరకు విద్యార్థులకు ప్యాంట్ షర్ట్, విద్యార్థినులకు పంజాబీ డ్రెస్ ఇవ్వనున్నారు. వస్త్రాలను పంపిణీ చేసి కుట్టుకూలి బ్యాంకులో డబ్బులను జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఏపీలో కరోనా వ్యాపిస్తున్నా..ఇతర కార్యక్రమాలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ స్కూళ్లలో నాడు – నేడు కింద చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. 2020, జూన్ కల్లా పనులు పూర్తి చేయాలని, చాక్ బోర్డ్, ఫర్నీచర్ తదితర వాటిపై టెండర్స్ పూర్తయ్యాయని చెప్పారు. స్కూల్ పిల్లలకు కిట్స్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు తయారు కావాలని జగన్ సంకల్పించారు.

పాఠశాలలను ఆధునీకరించాలని, సదుపాయాలు మెరుగుపర్చాలనే లక్ష్యంతో నాడు – నేడు కార్యక్రమం చేపడుతున్నారు. ప్రతి ఏడాది రూ. 1500 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.6 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం రెడీ అ    య్యింది. నాడు – నేడు స్కీం ద్వారా ఇప్పుడున్న స్కూల్ పరిస్థితి ఫొటో తీస్తారు. ఆ తర్వాత రెండు నుంచి నాలుగేళ్లలోపు స్కూళ్లలో ఎలాంటి మార్పులు వచ్చాయనే దానిపై ఫొటోల ద్వారా ప్రజలకు తెలియచేస్తారు.