Vakeel Saab Movie : వకీల్ సాబ్‌కు షాక్! సినిమా టికెట్ల ధరలు పెంచొద్దని హైకోర్టు ఆదేశం
వకీల్ సాబ్ సినిమా టికెట్ల ధరలు పెంచొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ సవరించింది.

Ap High Court Ordered That Should Not Increase The Tickets Prices Of Vakeel Saab Movie
vakeel Saab movie tickets prices : వకీల్ సాబ్ సినిమా టికెట్ల ధరలు పెంచొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ సవరించింది. రేపటి నుంచి ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే టికెట్ల ధరలు ఉండాలని ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను ఈరోజు వరకే అమలు చేయాలని డివివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
వకీల్ సాబ్ సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతించాలంటూ గత నెల 25వ తేదీన థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. వారి వినతిని మన్నించిన హైకోర్టు.. టికెట్ ధరల పెంపునకు అనుమతించింది. అయితే టికెట్ ధరల పెంపును ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో ధరల పెంపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన హైకోర్టు…వకీల్‌సాబ్ సినిమా టికెట్ల ధరలు పెంచొద్దని ఉత్తర్వులు జారీ చేసింది.
వకీల్ సాబ్ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 9, 2021) ప్రపంచ వ్యాప్తంగా 2500 స్ర్కీన్ లో రిలీజ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత వెండితెరపై మెరిశాడు. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచే థియేటర్ల దగ్గర అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. హిందీ `పింక్` రీమేక్ గా రూపొందించిన ఈ సినిమా యూఎస్, దుబాయ్ వంటి దేశాల్లో ఒక్క రోజు ముందే ప్రీమియర్ షోస్ పడ్డాయి.