AP Inter Exams Dates : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్ బోర్డు ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. మే 6వ తేదీ నుంచి మే 24 వరకు..(AP Inter Exams Dates)

AP Inter Exams Dates : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

Ap Inter Exams

Updated On : March 18, 2022 / 11:47 PM IST

AP Inter Exams Dates : ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్ బోర్డు ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే పరీక్షలను వాయిదా వేసిన ఇంటర్ బోర్డు.. కొత్త షెడ్యూల్ ఇచ్చింది. తొలుత ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు పరీక్షలు నిర్వహించాలని చూసినా.. జేఈఈ పరీక్షల కారణంగా వాయిదా వేసింది. తాజాగా కొత్త తేదీలను ప్రకటించింది.

మే 6వ తేదీ నుంచి మే 24 వరకు పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మే 6న ప్రారంభమై.. మే 23వ తేదీతో ముగుస్తాయి. ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ మే 7వ తేదీ నుంచి మే 24 వరకు జరుగుతాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.(AP Inter Exams Dates)

ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్..

మే 6 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1

మే 9 ఇంగ్లీష్ పేపర్-1

మే 11 మ్యాథ్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1

మే 13 మ్యాథ్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1

మే 16 ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1

మే 18 కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1

మే 20 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు)

మే 23వ తేదీ మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-1, జియాగ్రఫీ పేపర్-1

AP TenthClass Exams Schedule : పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. కొత్త పరీక్షల షెడ్యూల్ విడుదల

ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్..

* మే 7వ తేదీ సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II

* మే 10వ తేదీ ఇంగ్లీష్ పేపర్-II

* మే 12వ తేదీ మ్యాథ్స్ పేపర్-II-A

* మే 14న తేదీ మ్యాథ్స్ పేపర్-II-B, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II

* మే 17వ తేదీ ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II

* మే 19వ తేదీ కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్-II , సోషియాలజీ పేపర్-II, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-II

* మే 21వ తేదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, లాజిక్ పేపర్-II, మ్యాథ్స్ పేపర్-II (బైపీసీ విద్యార్థులకు)

* మే 24వ తేదీ మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-II, జియోగ్రఫీ పేపర్-II(AP Inter Exams Dates)

అటు.. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. జేఈఈ పరీక్షల తేదీలను ప్రకటించడంతో.. దానికి అనుగుణంగా టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. తాజాగా టెన్త్ పరీక్షల కొత్త తేదీలను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. పదవ తరగతి పరీక్షలను ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది కూడా టెన్త్ పరీక్షలను 7 రోజుల పాటు నిర్వహించనున్నారు.

టెన్త్ ఎగ్జామ్స్ కొత్త షెడ్యూల్..

ఏప్రిల్‌ 27వ తేదీ – తెలుగు (ఫస్ట్ లాంగ్వేజ్‌)

ఏప్రిల్ 28వ తేదీ – సెకండ్ లాంగ్వేజ్‌

ఏప్రిల్ 29వ తేదీ – ఇంగ్లీష్‌

మే 2వ తేదీ – మ్యాథ్స్

మే 4వ తేదీ – సైన్స్‌ పేపర్‌-1

మే 5వ తేదీ – సైన్స్‌ పేపర్‌-2

మే 6వ తేదీ – సాంఘికశాస్త్రం

మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 2వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇదే సమయంలో ఇంటర్‌ పరీక్షలున్నాయి. దీంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసిన పాఠశాల విద్యాశాఖ తాజాగా కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది.