చంద్రబాబుకు ప్రతిపక్ష స్థానం కూడా దక్కనివ్వం

చంద్రబాబుకు ప్రతిపక్ష స్థానం కూడా దక్కనివ్వం

Updated On : January 20, 2021 / 9:13 PM IST

Botsa Satyanarayana comments on Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష స్థానం కూడా దక్కనివ్వమన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పట్టాలపంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు హయాంలో పేదలకు కనీసం ఇళ్లపట్టాలు కూడా ఇవ్వలేక పోయారని విమర్శలు చేశారు.

తాము ఇంత పెద్ద ఎత్తున పట్టాలను మంజూరు చేస్తుంటే బురద జల్లు తున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో నాలుగు ఇల్లు ఇచ్చినందుకే సంబరాలు చేసుకుంటే.. ఊహించని స్థాయిలో పట్టాలను మంజూరు చేస్తున్న తాము సంబరాలు ఎందుకు చేసుకోకూడదని ప్రశ్నించారు.