PRC Talks : ట్విస్ట్ ఇచ్చిన ఏపీ సర్కార్.. చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాలకు ఫోన్

ప్రభుత్వం నుంచి చర్చల ఫోన్ కాల్.. ఉద్యోగ సంఘాల సమావేశాలు.. నిరసన ప్రణాళికలాంటి.. వరుస పరిణామాలు పీఆర్సీ ఉత్కంఠను పెంచుతున్నాయి.

PRC Talks : ట్విస్ట్ ఇచ్చిన ఏపీ సర్కార్.. చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాలకు ఫోన్

Prc Talks

Updated On : January 23, 2022 / 3:32 PM IST

PRC Talks : వేతన సవరణ-PRCపై ఆంధ్రప్రదేశ్ లో పరిణామాల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. రేపు సోమవారం 2022 జనవరి 24నాడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె నోటీస్ ఇవ్వాలని ఇప్పటికే ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ-జాక్ నిర్ణయించింది. ఈ నోటీసు ఎలా ఉండాలన్నదానిపైనే ఇవాళ విజయవాడలో ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ సమావేశమై చర్చిస్తోంది. ఐతే.. ఇంతలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

Read More : Police Attacked Woman : చిత్తూరులో ‘జై భీమ్‌’ సినిమా తరహా ఘటన.. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిచి మహిళపై దాడి

పీఆర్సీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పీఆర్సీ సాధన సమితి నేతలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్జి, మంత్రి పేర్ని నాని ఫోన్ చేశారు. చర్చలకు రావాలంటూ పిలుపునిచ్చారు. సంప్రదింపులకు రావాలని కోరారు. స్టీరింగ్ కమిటీలో చర్చ తర్వాత నిర్ణయం ఉంటుందని నేతలు ప్రభుత్వానికి తెలిపారు. పీఆర్సీ జీవోలను రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని నేతలు ప్రభుత్వానికి తేల్చిచెప్పినట్టు తెలిసింది.

మరోవైపు.. విజయవాడలో ఉద్యోగ సంఘాల కీలక నేతలు ఏకాంతంగా భేటీ అయ్యారు. 2 గంటలకు స్టీరింగ్ కమిటీ సమావేశం సమయంలోనే.. నలుగురు ఉద్యోగ సంఘాల నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ పై చర్చించారు. నలుగురు నాయకులు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ ఈ చర్చలు జరిపారు. మంత్రుల వద్దకు చర్చలకు వెళ్లాలా వద్దా అనే దానిపై చర్చించినట్టు తెలిసింది.

Read More : Hyderabad Traffic Police : ‘అఖండ’ ను వాడేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. బాలయ్యకి థ్యాంక్స్!

ప్రభుత్వం ఇస్తున్న కొత్త పీఆర్సీ ప్రతిపాదనలతో తమకు పెద్దగా ఒరిగేదేమీ లేదంటూ ఉద్యోగ సంఘాలు కొద్దిరోజులుగా అంటున్నాయి. ఐతే.. ప్రకటించిన పీఆర్సీని అమలు చేయడంలో తగ్గేదేలేదంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జీవోలను ఇటీవలే ఆమోదించేసింది. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగ సంఘాలు సమ్మె బాటలో పయనిస్తున్నాయి. ఆందోళనలు, నిరసనలతో.. సోమవారం నుంచి పీఆర్సీ ఉద్యమాన్ని హోరెత్తించేందుకు.. సమ్మె నోటీస్ ఇచ్చేందుకు ప్రిపరేషన్స్ లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి చర్చల ఫోన్ కాల్.. ఉద్యోగ సంఘాల సమావేశాలు.. నిరసన ప్రణాళికలాంటి.. వరుస పరిణామాలు పీఆర్సీ ఉత్కంఠను పెంచుతున్నాయి.