AP Rains: ఏపీలో మూడ్రోజులు వర్షాలు.. ఇవాళ ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం

తీవ్ర అల్పపీడనం ప్రభావంతో గంటకు గరిష్టంగా 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది.

AP Rains: ఏపీలో మూడ్రోజులు వర్షాలు.. ఇవాళ ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం

AP Rains

Updated On : December 19, 2024 / 7:53 AM IST

Heavy Rain Alert in AP: ఏపీలో మరోసారి వరుణుడు తన ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యాడు. గత నాలుగు నెలలుగా వరుస తుపానుల కారణంగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

AP Rains

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది. బుధవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలవైపు వెళ్లనుంది. ఆ తరువాత కోస్తా తీరం వెంబడి కదలనుంది. ఈ ప్రభావంతో గురు, శుక్ర, శనివారాల్లో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

AP Rains

ఇవాళ విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా నెల్లూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

AP Rains

సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తీవ్ర అల్పపీడనం ప్రభావంతో గంటకు గరిష్టంగా 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది.

AP Rains

శనివారంసైతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలాఉంటే ఈ నెల చివరి వారంలో అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐరోపాకు చెందిన మోడల్ సూచిస్తోంది. దీంతో ఈ నెలాఖరులో మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచిఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు.