AP Covid Update : ఏపీలో నిన్న కొత్తగా 108 కోవిడ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 108 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 141 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,878 యాక్టివ

Ap Covid Cases Update
AP Covid Update : ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 108 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 141 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,878 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,74,976 కి చేరింది. వీరిలో 20,58,631మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,467కు చేరింది. నిన్నటివరకు రాష్ట్రంలో3,07,98,406 శాంపిల్స్ పరీక్షించటం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read : Delhi Omicron Threat : ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం : సీఎం కేజ్రీవాల్
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు లేవు
కాగా విజయనగరం జిల్లాలోని వ్యక్తికి ఒమిక్రాన్ సోకిందని ప్రచారం జరిగిన.. వ్యక్తికి పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని ప్రజలెవరూ భయపడవద్దని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి చెప్పారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తి హోం క్వారంటైన్ లో ఐసోలేషన్ లో ఉన్నాడని అతనికి నెగెటివ్ వచ్చిందని ఆమె చెప్పారు.
అతడితో కాంటాక్ట్ అయిన 40 మందికి కూడా పరీక్షలు నిర్వహించామని అందరికీ నెగెటివ్ తేలిందని… రాష్ట్రంలో ఒమిక్రాన్ యాక్టివ్ కేసులు లేవని ఆమె వివరించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్ హైమవతి చెప్పారు.