AP Corona Cases : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4వేల 198 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు కరోనాతో చనిపోయారు.

AP Corona Cases : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Ap Corona Cases

Updated On : February 4, 2022 / 5:56 PM IST

AP Corona Cases : ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4వేల 198 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు కరోనాతో చనిపోయారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 9వేల 317 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 88వేల 364 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గురువారం 4వేల 605 కరోనా కేసులు నమోదవగా.. శుక్రవారం ఆ సంఖ్య తగ్గింది.

Stomach Problem : పొట్ట సమస్య బాధిస్తుందా!…పరిష్కారం మీ చేతుల్లో..?

24 గంటల వ్యవధిలో 30వేల 886 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,97,369కి చేరింది. కరోనా నుంచి ఇప్పటివరకు 21,94,369 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన తాజా కేసుల్లో.. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 555 కేసులు, అత్యల్పంగా విజయనగరంలో 54 కేసులు నమోదయ్యాయి. కరోనాతో చిత్తూరులో ఇద్దరు.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 14,646కి పెరిగింది.

గత రెండేళ్లుగా కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పీడిస్తోంది. కరోనా కట్టడికి అన్ని దేశాలు కోవిడ్ టీకాలపైనే ఆధారపడ్డాయి. ఇప్పటికే విస్తృతంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాయి. దీని ఫలితం కనిపిస్తోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుతోంది. ప్రస్తుతం భారత్ లోనూ కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పడుతోంది. కానీ మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.

Omicron: ఒమిక్రాన్ ఒకే మనిషికి మళ్లీ మళ్లీ వస్తదా..

గత 24 గంటల్లో దేశంలో ఒక లక్ష 49వేల 394 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, ఏకంగా 1072 మంది కోవిడ్ తో మరణించడం ఆందోళన కలిగించే అంశం. మొన్న న‌మోదైన కేసుల కంటే నిన్న 13 శాతం త‌క్కువ‌గా న‌మోద‌య్యాయి. దేశంలో రోజువారీ కోవిడ్-19 కేసుల్లో గణనీయమైన తగ్గుదల నమోదైందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. రోజువారీ సానుకూలత రేటు (పాజిటివిటీ రేటు) 9.27 శాతానికి తగ్గింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 14,35,569. ఒక్క రోజు వ్యవధిలో 2,46,674 మంది కోవిడ్ నుండి కోలుకున్నారు. దేశంలో కోవిడ్ తో చనిపోయిన వారి సంఖ్య‌ 5,00,055కి పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు 168.47 కోట్ల డోసుల‌ వ్యాక్సిన్లు వేశారు.