AP Corona Cases : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6వేల 213 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 5 మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 10వేల 795 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

Ap Corona Cases
AP Corona Cases : ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే, సోమవారం నమోదైన కేసులతో పోలిస్తే.. ఇవాళ కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6వేల 213 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 5 మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 10వేల 795 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,05,930 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
WhatsApp Alert : వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35,053 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 903 కేసులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 830 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 731, కర్నూలు జిల్లాలో 679 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. కాగా, సోమవారం 5వేల 879 కరోనా కేసులు నమోదవగా, మంగళవారం ఆ సంఖ్య పెరిగింది.
మరోవైపు దేశవ్యాప్తంగానూ కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కేసుల నమోదులో భారీ తగ్గుదల కనిపిస్తోంది. 2 లక్షల కంటే తక్కువగా రోజువారీ కేసులు నమోదయ్యాయి.
Union Budget 2022: బడ్జెట్ తర్వాత బూట్లు, బట్టల ధరలు తగ్గాయి.. ఏవి పెరిగాయో తెలుసా?
గత 24 గంటల్లో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే సమయంలో మరో 1,192 మంది కరోనాతో మరణించారు. దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 4,96,242 కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 2,54,076 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. రికవరీ రేటు 94.60 శాతానికి మెరుగుపడింది.
మరోవైపు రోజువారీ పాజిటివిటీ రేటు 11.69 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 17,43,059 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 1,66,68,48,204 డోసుల వ్యాక్సిన్ వేశారు. దేశంలో రోజువారీ కోవిడ్-19 కేసుల్లో గణనీయమైన తగ్గుదల నమోదైందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.