Ashok Gajapathi Raju: రేప్ కేసు తప్ప మిగిలిన సెక్షన్లు అన్నీ పెట్టారు.. ఇలా అరెస్ట్ చేస్తారా?

Ashok Gajapathi Raju: రేప్ కేసు తప్ప మిగిలిన సెక్షన్లు అన్నీ పెట్టారు.. ఇలా అరెస్ట్ చేస్తారా?

Ashok Gajapathi Raju condemns Chandrababu Naidu Arrest

Updated On : September 9, 2023 / 11:13 AM IST

Ashok Gajapathi Raju: తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్ పై టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేప్ కేసు తప్ప మిగిలిన సెక్షన్లు అన్ని చంద్రబాబుపై బనాయించటం ఘోరమన్నారు.

ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో సమాధానం కూడా పోలీసులు చెప్పకపోవటం జగన్ రెడ్డి పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసే తీరు ఇదా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. అన్ని దేవాలయాలకు ప్రజలు వెళ్లి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని దేవుళ్లను వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నాలుగున్నరేళ్లలో ఒక సైకో దొంగ కోర్టుకి వెళ్లకుండా ప్రభుత్వం జాగ్రత్త పడగలిగిందని ఆరోపించారు.

టీడీపీ శ్రేణుల నిరసనలు
చంద్రబాబు అరెస్ట్ నేపధ్యంలో విజయనగరంలో ముందస్తు జాగ్రత్తగా ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ఆర్టీసి డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి.

Also Read: నా తండ్రిని అరెస్ట్ చేస్తే నన్ను రెస్ట్ తీసుకోమంటారా..? అంటూ పోలీసులపై లోకేశ్ ఫైర్

బస్సుల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు లేవు: ఆర్టీసీ
రాష్ట్రంలో బస్సుల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆర్టీసీ తెలిపింది. యథా ప్రకారం అన్ని బస్సు సర్వీసులు నడుస్తాయని ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికులు యథా ప్రకారం తమ ప్రయాణాలు చేసుకోవచ్చని సూచించింది.

Also Read: చంద్రబాబు అరెస్టు, ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్