Farmers in AP: ఏపీలో “పంట బీమా పధకం”తో రైతులకు ఉపయోగంలేదు: రైతు సంఘం

ఏపీలో సీఎం జగన్ రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో రైతులకు ఏ మాత్రం లబ్ది చేకూరడంలేదని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు పేర్కొన్నారు.

Farmers in AP: ఏపీలో “పంట బీమా పధకం”తో రైతులకు ఉపయోగంలేదు: రైతు సంఘం

Farmes

Updated On : February 14, 2022 / 7:33 AM IST

Farmers in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల కోసం ప్రభుత్వం తెచ్చిన పంటల బీమా పధకం “వైఎస్ఆర్ పంట బీమా”తో రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదని భారతీయ కిసాన్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం గుంటూరులో జరిగిన ఓ సమావేశంలో భారతీయ కిసాన్ సంఘ్ రైతు సంఘం నేతలు, సభ్యులు పలు అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో సీఎం జగన్ రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో రైతులకు ఏ మాత్రం లబ్ది చేకూరడంలేదని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులకు పధకాలు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.

Also read: ISRO – PSLV-C52: మూడు ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ52

రాష్ట్రంలో రైతు సమస్యలను ప్రభుత్వం విస్మరించడంపై ఆందోళన వ్యక్తం చేసిన భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు..ఆమేరకు సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మార్చి 4న రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి గవర్నర్ కు, ముఖ్యమంత్రికి లేఖలు రాయాలని అప్పుడు కూడా స్పందించని పక్షంలో జూన్ 6న చలో సెక్రటేరియేట్ కు పిలుపునివ్వనున్నట్లు కిసాన్ సంఘ్ కార్యదర్శి సాయిరెడ్డి పేర్కొన్నారు.

Also read: Anna Hazare: ఆమరణ నిరాహార దీక్షను విరమించుకున్న అన్నా హజారే