AP Rains: బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న తుఫాన్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలకు చాన్స్.. అధికారులతో మంత్రి అనిత సమీక్ష.. ప్రజలకు కీలక సూచనలు..

బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై మంత్రి అనిత సమీక్షించారు.

AP Rains: బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న తుఫాన్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలకు చాన్స్.. అధికారులతో మంత్రి అనిత సమీక్ష.. ప్రజలకు కీలక సూచనలు..

Heavy Rains (Old Image)

Updated On : July 25, 2025 / 2:25 PM IST

AP Rains: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత వారంరోజులుగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, సిబ్బందితో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు.

బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై మంత్రి అనిత సమీక్షించారు. వాయుగుండం ఇవాళ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను తాకే అవకాశం ఉందని, రానున్న 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ వైపుగా కదులుతుందని, ఈ కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి స్వయంగా హోం మంత్రి అనిత పరిశీలించారు. అత్యవసర సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 ఏర్పాటు చేశారు.

ఆదివారం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోమంత్రి అనిత సూచించారు. రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాల్లో అలలు 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తులో ఎగసిపడే అవకాశం ఉందని, సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు.

వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి అనిత ఆదేశించారు. ప్రమాద హాట్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ శాఖలతో నమన్వయ పరుచుకుని గండ్లు గుర్తించి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే తక్కువ స్థాయిలో ఉన్న చెరువులు, వాగులు, కాల్వలను పరిశీలించి నీటి మట్టాలను నియంత్రించేందుకు తగిన చర్యలు ప్రారంభించబడ్డాయి. గండ్లు దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి, మరమ్మతులు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.

తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు నీటి ముంపు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ అంతరాయం, రోడ్ల నష్టం, చెట్లు కూలే ప్రమాదాలు ఉండే అవకాశం ఉన్నందున, ప్రజలు రాత్రివేళల్లో అత్యవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.