Kolusu Parthasarathy : ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి- మంత్రి పార్థసారధి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భయానికి గురైన ప్రజల భయాన్ని పోగొట్టామన్నారు.

Kolusu Parthasarathy : ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి- మంత్రి పార్థసారధి

Updated On : January 14, 2025 / 1:20 AM IST

Kolusu Parthasarathy : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు మంత్రి కొలుసు పార్థసారధి. జగన్ వ్యవహార శైలి మార్చుకోవడం లేదనే అందరూ వైసీపీని వీడుతున్నారని మంత్రి పార్థసారధి అన్నారు. సంక్రాంతి కేవలం కూటమి నాయకులకే అని వైసీపీ నేతలంటున్నారు.. సంక్రాంతి ఎవరికో అవగాహన లేకుండా, క్షేత్రస్ధాయిలో అంశాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వంలో రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. గతంలో ఎగ్గొట్టిన సబ్సిడీలు అన్నీ పునరుద్ధరించామన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేస్తోందని వివరించారు.

Also Read : తిరుమల లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన భక్తులు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భయానికి గురైన ప్రజల భయాన్ని పోగొట్టామన్నారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే ఆకలి తీరుస్తున్నామన్నారు. NREGS ద్వారా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సిమెంట్ రోడ్లు గ్రామాలకు వచ్చాయని మంత్రి కొలుసు పార్థసారధి వెల్లడించారు. వైసీపీ పాలనలో 6,679 కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తే.. కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే 85వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిందన్నారు.

ఏపీలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయని మంత్రి చెప్పారు. 65 వేల కోట్లతో సిబిజి ప్లాంట్లు పెట్టడానికి MoUతో పాటు అనుమతులు కూడా వచ్చాయన్నారు మంత్రి కొలుసు పార్థసారధి.

Also Read : హైందవ ధర్మంపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోం- కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ