ఎమ్మెల్సీ రఘురాజుకు ఊరట.. అనర్హత వేటును రద్దు చేసిన హైకోర్టు..

దీనిపై అప్పటి నుంచి కోర్టులో వాదోపవాదాలు జరుగుతూ వచ్చాయి. తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది.

ఎమ్మెల్సీ రఘురాజుకు ఊరట.. అనర్హత వేటును రద్దు చేసిన హైకోర్టు..

Indukuri Raghu Raju (Photo Credit : Google)

Updated On : November 6, 2024 / 7:47 PM IST

Indukuri Raghu Raju : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రఘురాజుపై అనర్హత వేటును హైకోర్టు రద్దు చేసింది. రఘురాజుపై మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. దీనిపై రఘురాజు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుతో 2027 నవంబర్ 31 వరకు రఘురాజు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నిలిచిపోనుంది.

ఎస్ కోట ఎమ్మెల్యే శ్రీనివాస్ కు వైసీపీ టికెట్ ఇవ్వొద్దంటూ జగన్ కు చెప్పడం జరిగింది. అయితే, మాటను ధిక్కరించిన శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వడంతో.. మనస్తాపానికి గురైన రఘురాజు.. తన కుటుంబసభ్యులు, అనుచరులతో కలిసి టీడీపీ వాళ్లకు అనుకూలంగా పని చేసినట్లు వైసీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. అప్పుడు మండల ఛైర్మన్ గా ఉన్న మోషేన్ రాజుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మోషేన్ రాజు.. రఘురాజుపై అనర్హత వేటు వేశారు. దీనిపై రఘురాజు హైకోర్టును ఆశ్రయించారు. నేను చేసిన తప్పు ఏంటి? ఎందుకు అనర్హత వేటు వేశారు? అని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.

దీనిపై అప్పటి నుంచి కోర్టులో వాదోపవాదాలు జరుగుతూ వచ్చాయి. తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో 2027 నవంబర్ 31 వ తేదీ వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారని సంచలన తీర్పు ఇచ్చింది. సుదీర్ఘమైన పోరాటం తర్వాత అనుకూలంగా తీర్పు రావడంతో రఘురాజు, ఆయన కుటుంబసభ్యులు, అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతిమంగా న్యాయం గెలిచింది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. మరోపక్క అనర్హత వేటు చెల్లదని కోర్టు ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఎన్నిక జరుగుతుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. మరోపక్క చూసుకుంటే.. అమరావతిలో వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన జరిగిన విజయనగరం జిల్లా నేతల సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి వైసీపీ అభ్యర్థిని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడిని అభ్యర్థిగా ప్రకటిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం తీసుకున్న కొద్దిసేపటికే హైకోర్టు తీర్పు వెలువడింది. ఈ నెల 4న ఇచ్చిన నోటిఫికేషన్ ను అనుసరించి ఎన్నిక కొనసాగుతుందా? లేదా? ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్సీ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. న్యాయస్థానం తీర్పును మండలి ఛైర్మన్ అమలు చేస్తారా? లేక అప్పీల్ కు వెళ్తారా? అన్నదానిపై చర్చ నడుస్తోంది.

ఇందుకూరి రఘురాజు వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన పార్టీ మారారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వైసీపీ నాయకులు ఆరోపించారు. దీనిపై మండలి చైర్మన్ మోషేన్ రాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని రఘురాజుకు మండలి ఛైర్మన్ నోటీసులు ఇవ్వగా.. ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో రఘురాజుపై అనర్హత వేటు పడింది. దీంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.

విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 4న నోటిఫికేషన్ విడుదలవగా.. 11 వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12 న నామినేషన్లు పరిశీలిస్తారు. 14 వ తేదీ వరకు ఉపసంహరణ గడవు ఇచ్చారు. నవంబర్ 28న పోలింగ్ జరగనుంది.

 

Also Read : ఆరోజు ఎందుకు సీరియస్ అయ్యానంటే..- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు