MP GVL : హోదాతో ప్రయోజనం లేదు.. ఏపీని కేంద్ర పాలిత ప్రాంతం చేయమంటారా?-జీవీఎల్

ప్రత్యేక హోదాతో ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన తేల్చి చెప్పారు. స్పెషల్ స్టేటస్ అనేది టీడీపీ, వైసీపీ పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడానికి ఉపయోగించే రాజకీయ అంశం అని అన్నారు.

MP GVL : హోదాతో ప్రయోజనం లేదు.. ఏపీని కేంద్ర పాలిత ప్రాంతం చేయమంటారా?-జీవీఎల్

Mp Gvl Narasimha Rao

Updated On : February 8, 2022 / 7:17 PM IST

MP GVL : ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాతో ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని స్పష్టం చేశారు. స్పెషల్ స్టేటస్ అనేది టీడీపీ, వైసీపీ పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడానికి ఉపయోగించే రాజకీయ అంశం అని అన్నారు. ప్రత్యేక హోదాకు పారిశ్రామిక రాయితీలకు ఎలాంటి సంబంధం లేదన్న జీవీఎల్.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరారు.

Safer Internet Day 2022: ఆన్‌లైన్‌లో మీ పిల్లలు జాగ్రత్త.. సేఫ్‌గా ఉంచేందుకు 5మార్గాలు ఇవే!

రాజకీయ కారణాలతో గతంలో ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని తిరస్కరించారని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా అంశం లేదన్న జీవీఎల్ 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా లేదని చెప్పిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాకు బదులుగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ వచ్చిందని చెప్పారు. పాండిచ్చేరి లాంటి ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వాలంటే, ఏపీని కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయమంటారా? అని జీవీఎల్ ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా పేరుతో ఏపీకి మళ్లీ అన్యాయం చేయొద్దని జీవీఎల్ కోరారు. ప్రత్యేక హోదా అనే పేరుతో వచ్చేదేమీ లేదని, అంతకు మించి రాష్ట్రానికి నిధులు అందుతున్నాయని వివరించారు. పెళ్లిలో అంబాసిడర్ కారు ఇస్తానని మాట ఇచ్చాక, అంబాసిడర్ కారు ప్రొడక్షన్ ఆగిపోతే, మాకు అదే కారు కావాలని గోల చేసినట్టుగా ఏపీ నేతల తీరు ఉందని జీవీఎల్ ఎద్దేవా చేశారు.

Soaked Nuts : తినటానికి ముందు గింజలను ఎన్ని గంటలు నానబెట్టాలి?…

”విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ ఆమోదింపబడి భవన నిర్మాణం జరుగుతోంది. మోదీ ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా పని చేస్తోంది. కేంద్రం గత మూడు నాలుగు సంవత్సరాల్లో పన్నుల రూపంలో సేకరించిన ధనం కన్నా ఎక్కువ నిధులను ఏపీకి ఇచ్చింది. 2020-21 లో పన్నుల రూపంలో 57,472 కోట్ల ఆదాయం వస్తే పన్నుల వికేంద్రీకరణ, గ్రాంట్ల రూపంలో, ఇతర రూపాల్లో 75 వేల కోట్లు ఇచ్చింది. ఏపీకి ఆర్ధికంగా వనరులు లేని కారణంగా గ్రాంట్ల రూపంలో, అదనపు నిధులు కేంద్రం ఇస్తుంది. కేంద్రం ఏపీ పట్ల చూపిస్తున్న చొరవగా భావిస్తున్నాం. విశాఖలో హెచ్ పీసీఎల్ ద్వారా రిఫైనరీ విభాగంలో 26వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది.

ఏపీలో నిలిచిపోయిన 6 రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరా. వీలైనంత నిధులు కేంద్రం నుంచి కేటాయిస్తామని, భూ కేటాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కేంద్రమంత్రి కోరారు. రాష్ట్రంలో కొత్త రైల్వే ప్రాజెక్టులు, కొత్త రైళ్లు ప్రారంభించాలని కోరా” అని జీవీఎల్ అన్నారు.