Vijayawada : శాంతాక్లాజ్ వేషంలో ఉన్న ఏపీ వుమెన్ మినిస్టర్ ఎవరో కనిపెట్టగలరా?
క్రిస్మస్ పండుగ అనగానే శాంతా క్లాజ్ గుర్తొస్తాడు. శాంతా క్లాజ్ వస్తాడు.. బహుమతులు ఇస్తాడు అని పెద్దలు, పిల్లలు ఎదురుచూస్తారు. అయితే ఇక్కడ శాంతా క్లాజ్ వేషంలో ఉన్నది ఎవరు? ఎవరికి సాయం చేసారు? కనిపెట్టండి.

Vijayawada
Vijayawada : మంత్రి రోజా శాంతాక్లాజ్ వేషం వేసుకున్నారు. ఓ కాలనీలోని ఇంట్లోకి వెళ్లారు. కష్టాల్లో ఉన్న ఓ కుటుంబాని ఆర్ధిక సాయం అందించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని రోజా తాను సాయం చేసిన వీడియోను విడుదల చేసారు.

Minister Roja 1
Minister Roja : నాకు కాకపోతే వారిద్దరికిస్తారా?.. నగరిలో పోటీపై మంత్రి రోజా ఆక్తికర వ్యాఖ్యలు
సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా సీఎం రోజా ఓ కుటుంబానికి మర్చిపోలేని ఆనందం పంచారు. శాంతాక్లాజ్ వేషం వేసుకుని విజయవాడ వాంబే కాలనీలో నివాసం ఉంటున్న దివ్యాంగుడు నాగరాజు ఇంటికి వెళ్లారు. చాక్లెట్స్, బట్టలను వెంట తీసుకెళ్లారు. నాగరాజు ఇంటి తలుపు కొట్టగానే లోనికి వెళ్లిన రోజాను చూసి కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. చాక్లెట్స్, బట్టలతో పాటు రోజా ఆ కుటుంబానికి రోజా రూ.2 లక్షలు ఆర్ధిక సాయం అందించారు.
Minister Roja : జగన్ ఫోటో ఉంటే చాలు ఎవరైనా గెలుస్తారు- మంత్రి రోజా

Minister Roja 2
నాగరాజుకి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భార్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. నాగరాజు రోడ్డుపై చెప్పులు విక్రయిస్తున్నాడు. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న నాగరాజు గురించి తెలుసుకున్న మంత్రి రోజా అతనికి సాయం చేయాలనుకున్నారు. ఏటా సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంలో తను ఒక మంచి పని చేస్తుంటానని ఈ సంవత్సరం నాగరాజు కుటుంబానికి సాయం చేయడం సంతోషం కలిగించిందని రోజా చెప్పారు. తనకెంతో ఇష్టమైన తన తండ్రి నాగరాజు రెడ్డి పేరుతో ఉన్న నాగరాజుకి సాయం చేయడం కూడా తనకు కనెక్ట్ అయ్యిందని రోజా చెప్పారు. ప్రస్తుతం మంత్రి రోజా నాగరాజు కుటుంబానికి సాయం చేసిన వీడియో వైరల్ అవుతోంది.