Amaravati : అమరావతిలో టెన్షన్ టెన్షన్..ఎమ్మెల్యే నంబూరి శంకరరావు, శ్రీధర్ సవాళ్లు, ప్రతి సవాళ్లు
ఈ నేపథ్యంలో అమరావతిలో భారీగా పోలీసులు మెహరించారు. ఇరువురి సవాళ్ళ నేపధ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. అమరావతిలో పరిస్థితిని డీఎస్పీ ఆదినారాయణ సమీక్షిస్తున్నారు.

Shankar Rao Sridhar
Amaravati : పల్నాడు జిల్లా అమరావతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇసుక అక్రమ తవ్వకాలపై వైసీపీ, టీడీపీ సవాళ్లు విసురుకుంటున్నాయి. ఎమ్మెల్యే నంబూరి శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఒకరినొకరు సవాళ్ళు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రమాణం లేదా బహిరంగ చర్చకు ఇద్దరు నేతలు సిద్ధమయ్యారు.
ఇసుక అక్రమ తవ్వకాలపై ఎమ్మెల్యే నంబూరి శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఒకరిపైమరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తనపై చేస్తున్న ఇసుక అక్రమ తవ్వకాల ఆరోపణలను రుజువు చేయాలని కొమ్మాలపాటి శ్రీధర్ సవాల్ చేస్తున్నారు. ఆదివారం 9 గంటలకు అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే నంబూరి శంకరరావు అక్రమాలను నిరూపిస్తానని చెప్పారు. ఆలయం వద్ద బహిరంగ సవాల్ చేస్తానని చెప్పడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు చర్చకు మీరు రెడీనా.. మీరు రెడీనా అని అనుకుంటున్నారు. దీంతో పెదకూరపాడు రాజకీయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఈ నేపథ్యంలో అమరావతిలో భారీగా పోలీసులు మెహరించారు. ఇరువురి సవాళ్ళ నేపధ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. అమరావతిలో పరిస్థితిని డీఎస్పీ ఆదినారాయణ సమీక్షిస్తున్నారు. పట్టణంలో ప్రత్యేక బలగాలు మోహరించారు. అమరావతి పట్టణంలో 144 సెక్షన్ విధించారు.