రూ.కోటి విలువైన భూమి ధర 10లక్షలకు పడిపోయింది : జగన్ పాలన చూస్తుంటే రక్తం మరుగుతోంది

ఏపీలో తుగ్లక్ పాలన సాగుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏమైనా వైసీపీ వాళ్ల బాబు

  • Published By: veegamteam ,Published On : January 11, 2020 / 02:02 AM IST
రూ.కోటి విలువైన భూమి ధర 10లక్షలకు పడిపోయింది : జగన్ పాలన చూస్తుంటే రక్తం మరుగుతోంది

Updated On : January 11, 2020 / 2:02 AM IST

ఏపీలో తుగ్లక్ పాలన సాగుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏమైనా వైసీపీ వాళ్ల బాబు

ఏపీలో తుగ్లక్ పాలన సాగుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏమైనా వైసీపీ వాళ్ల బాబు జాగీరా అని విమర్శించారు. వైసీపీ సర్కార్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో పోరాడుతున్న రైతులను, మహిళలని కూడా చూడకుండా అన్యాయంగా కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధాని అంటే పేకాటలో మూడు ముక్కలాట అనుకున్నారా అంటూ మండిపడ్డారు చంద్రబాబు. రాజమహేంద్రవరంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రజాచైతన్య యాత్ర సభలో చంద్రబాబు మాట్లాడారు. అమరావతిని మార్చాలని రాష్ట్రంలో ఒక్కరైనా అడిగారా అని ప్రశ్నించారు. 3 రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా అంటూ మండిపడ్డారు. జీవితంలో తొలిసారిగా అమరావతి కోసం జోలె పట్టానన్నారు. వైసీపీ పాలన చూస్తుంటే రక్తం మరిగిపోతోందన్నారు చంద్రబాబు.

రైతుల పొట్ట కొట్టాలని విశాఖ వాసులు కోరుకోరని చంద్రబాబు అన్నారు. విశాఖ జిల్లాపై వైసీపీ నేతలకు ప్రేమ లేదని, అక్కడి భూములపైనే ప్రేమ ఉందని విమర్శించారు. విశాఖపై ప్రేమ ఉంటే ఇప్పటికే అనేక సంస్థలు తెచ్చేందుకు కృషి చేసేవారన్నారు. ఏ-2 విశాఖలోనే 7 నెలలుగా ఉండి భూములపై కన్నేశారని పరోక్షంగా ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఆరోపణలు చేశారు.

అమరావతిని రియల్‌ ఎస్టేట్‌ అని ఆరోపిస్తున్నారని.. రైతుల భూముల ధరలు పెరిగితే మీకొచ్చిన ఇబ్బందేంటని వైసీపీ నేతలను చంద్రబాబు ప్రశ్నించారు. కోటి విలువైన భూమిని రూ.10లక్షలకు పడిపోయేలా చేసిన పెద్దమనిషి జగన్‌ అంటూ విరుచుకుపడ్డారు. అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు చంద్రబాబు. వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలనూ తానొక్కడినే ఎదుర్కోగలనని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.   

* ఏపీలో తుగ్లక్ పాలన సాగుతోందన్న టీడీపీ అధినేత చంద్రబాబు
* మూడు రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా అని ప్రశ్న
* రాష్ట్రం ఏమైనా వైసీపీ వాళ్ల బాబు జాగీరా అని విమర్శ
* వైసీపీ సర్కార్‌కు ఖబర్దార్ అంటూ హెచ్చరిక
* రైతులు, మహిళలని చూడకుండా కొడుతున్నారని ఆవేదన 
* విశాఖ భూములపైనే వైసీపీ నేతలకు ప్రేమ
* 7 నెలలుగా విశాఖ భూములపై కన్ను
* కోటి విలువైన భూమి 10లక్షలకు పడిపోయింది
* 151 మంది ఎమ్మెల్యేలను ఒక్కడినే ఎదుర్కోగలను

Also Read : రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోవాలి..పెద్దన్న పాత్ర పోషించాలి – పవన్