జగన్ మూర్ఖుడు : రైతుల కోసం బాబు కుటుంబం

  • Published By: madhu ,Published On : January 15, 2020 / 06:50 AM IST
జగన్ మూర్ఖుడు : రైతుల కోసం బాబు కుటుంబం

Updated On : January 15, 2020 / 6:50 AM IST

రాజధాని రైతుల కోసం తాము సంక్రాంతి పండుగ జరుపుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2020, జనవరి 15వ తేదీ . రాజధానిని పరిరక్షించుకొనేందుకు రైతులు, మహిళలు 2020, జనవరి 15వ తేదీ బుధవారం ఉపవాస దీక్షలు చేస్తున్నారు. వీరికి చంద్రబాబు కుటుంబసభ్యులు సంఘీభావం తెలిపారు. బాబు సతీమణి భువనేశ్వరీ, కోడలు బ్రాహ్మణి వచ్చారు. 

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ…విశాఖ రాజధాని కావాలని అక్కడి ప్రజలు అడగలేదనే విషయాన్ని ఆయన చెప్పారు. రాజధాని 29 గ్రామాల సమస్య కాదని..ఐదు కోట్ల ప్రజల సమస్య అన్నారు. రైతులకు మద్దతుగా సంక్రాంతి జరుపుకోవడం లేదని, 29 గ్రామాల ప్రజలు త్యాగం చేశారని వివరించారు. త్యాగాలను కూడా గుర్తించలేని మూర్కుడు సీఎం జగన్ అని అభివర్ణించారు. ఎడ్ల పందాలు ప్రారంభించడానికి వెళ్లిన సీఎం జగన్..రాజధాని ప్రాంతాలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. 

ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే కుదరదని హెచ్చరించారు. అధైర్యపడి ఎవరూ ప్రాణత్యాగం చేయవద్దని సూచించారు. రాజధాని ఎక్కడో విభజన చట్టంలో పేర్కొన్నారని వివరించారు. రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి..ఇక్కడే పనిచేసే విధంగా తాను గతంలో కృషి చేయడం జరిగిందని, ఎన్నో పరిశ్రమలు ఇక్కడకు తరలిరావాలని ఆకాంక్షించానని వెల్లడించారు. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని తాను ప్రయత్నించినట్లు గుర్తించారు.

కులాలకు, మతాలకతీంగా ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే…తనపై కుల ముద్ర వేశారన్నారు. తాను మొట్టమొదటిసారిగా జోలె పట్టుకుని విరాళాలు కోరడం జరిగిందని, హైదరాబాద్ ధీటుగా విశాఖపట్టణం ముందుకు వెళ్లేదని తెలిపారు. రైతులు ఆందోళన పడుతుంటే..వైసీపీ నాయకులు సంతోష పడుతున్నారని వెల్లడించారు. సంక్రాంతి పండుగలాంటి పవిత్రమైన రోజున..ఉపవాస దీక్షలు చేయడం ఎంతగానో బాధిస్తుందని అన్నారు బాబు. 

Read More : సీఎంగా వైఎస్ భారతీ: మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు