సీఎం జగన్ ఉన్మాది : బండ బూతులు తిడుతున్నారు – బాబు

ఏపీ ముఖ్యమంత్రి ఒక ఉన్మాది..వైసీపీ నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు..40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నా..11 మంది ముఖ్యమంత్రులను చూశా..కానీ..ఇలాంటి సీఎంను చూడలేదు..వైసీపీ నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు..బండ బూతులు తిడుతున్నారంటూ టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ, శాసనమండలిలో జరిగిన పరిణామాలపై 2020, జనవరి 24వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మాట్లాడారు.
తాము నిరసన వ్యక్తం చేస్తుంటే..పోలీసులు తమను అదుపులోకి తీసుకుని..వాహనాల్లో ఇష్టమొచ్చినట్లు తిప్పారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రిని, గౌరవ శాసనసభ్యులని లెక్క చేయకుండా..గంట, రెండు గంటల పాటు వాహనాల్లో తిప్పారని తెలిపారు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో చెప్పాలని అడిగితే..సమాధానం కూడా చెప్పలేదన్నారు. రెండో రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఏకపక్షంగా దాడులు చేశారని, జై అమరావతి, అమరావతి ఇక్కడే ఉండాలి, మూడు రాజధానులు వద్దు..ఒకే రాజధాని కావాలని తాము అడిగడం నేరమా అని ప్రశ్నించారు.
రింగ్ పెట్టి..అది దాటితే..లేపి బయటపడేయాలని సీఎం జగన్ చెప్పడం..వెంటనే స్పీకర్ మార్షల్స్‌ని పిలవడం జరిగిందన్నారు. గౌరవ సభ్యులను సస్పెండ్ చేయాలంటే ఇదా విధానమా అని సూటిగా ప్రశ్నించారు. శాసనమండలిలో కొన్ని టీవీ ఛానళ్ల ప్రసారం ఆపేశారని, లైవ్‌ను కూడా ఆపేశారని..ఎవరిచ్చారు హక్కు ? అంటూ ప్రశ్నించారు బాబు.
మండలి ఛైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటుంది.
* సభలో మాట్లాడకుండా..మైక్ కట్ చేశారు.
* ఇంత సీరియస్ బిల్లుపై చర్చకు సమయం ఇవ్వరా ?
* ముఖ్యమైన బిల్లులపై లాభనష్టాలు చెప్పడం ప్రతిపక్షంగా తమ బాధ్యత.
* అమరావతిలోనే రాజధాని ఉండాలని తాము కోరుకోవడం తప్పా ?
* అసెంబ్లీ నుంచి తమ సభ్యులను ఏకపక్షంగా సస్పెండ్ చేశారు.
* అసెంబ్లీలో కనీసం మాట్లాడే సమయం ఇవ్వలేదు.
Read More : రూ. 1.51కోట్లు వసూలు చేసిన రైల్వే టీసీ