Chandrababu : వేంకటేశ్వరస్వామి వల్లే బతికి ఉన్నా.. అలిపిరి బాంబు బ్లాస్ట్ ఘటనపై చంద్రబాబు..

తంలో చంద్రబాబుపై అలిపిరిలో బాంబు బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ 2003 అక్టోబర్ 1 అలిపిరి ఘటన అంటూ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు...........

Chandrababu : వేంకటేశ్వరస్వామి వల్లే బతికి ఉన్నా.. అలిపిరి బాంబు బ్లాస్ట్ ఘటనపై చంద్రబాబు..

Chandrababu alipiri

Updated On : October 14, 2022 / 8:55 PM IST

Chandrababu :  బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్‌ షో భారీ హిట్ అయి రికార్డులని కూడా సాధించడంతో ఈ షోకి సీజన్ 2ని కూడా ప్రకటించి గ్రాండ్ లాంచ్ చేశారు. అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, తాజాగా నేడు ఆహాలో మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఎపిసోడ్ రిలీజైన కొద్దిసేపటికే ఇది వైరల్ గా మారింది.

ఇక మొదటి ఎపిసోడ్ లో మాజీ సీఎం, బాలకృష్ణకు బావ అయిన చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. షోలో ఎన్నో సరదా విషయాలు, రాజకీయాలు మాట్లాడారు. అలాగే లోకేష్ కూడా రావడంతో లోకేష్ కి సంబంధించిన పలు విషయాలని కూడా ప్రస్తావించారు బాలకృష్ణ. ఇందులో భాగంగా గతంలో చంద్రబాబుపై అలిపిరిలో బాంబు బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ 2003 అక్టోబర్ 1 అలిపిరి ఘటన అంటూ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు.

చంద్రబాబు ఈ సంఘటనపై మాట్లాడుతూ.. . ఎన్టీఆర్ 1984లో అన్నదానం ప్రారంభించారు. ఇప్పటికి కూడా అది జరుగుతుంది. అదే స్పూర్తితో ప్రాణదానం అనే కార్యక్రమం మొదలుపెట్టడం కోసం వెళ్ళాము. సిమ్స్, రుయా హాస్పిటల్స్ లో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్నాం. ఆ కార్యక్రమం ప్రారంభం అయిపోయిన తర్వాత తిరిగి బయలుదేరాము. అలిపిరి వద్ద పెద్ద సౌండ్ వచ్చింది. కారు ఎగిరి ఒక ఇల్లుని బద్దలు కొట్టింది. నన్ను తీసుకెళ్లి అంబులెన్స్ లో పడుకోపెట్టారు. ఆ తర్వాత నాకేమి గుర్తులేదు. కళ్ళు తెరిచేసరికి రుయా హాస్పిటల్ లో ఉన్నాను. తెలివి వచ్చాక పోలీస్, కలెక్టర్ ని అడిగితే 24 మైన్స్ బాంబ్స్ పేలాయి అన్నారు. అన్ని పేలినా నాకు, నా కార్ లో ఉన్నవాళ్లు దెబ్బలతో బయటపడ్డాం అంటే అది వేంకటేశ్వరస్వామి వల్లే. అది నాకు పునర్జన్మ అని అన్నారు.

Lokesh – Brahmani : బ్రాహ్మణి, లోకేష్ ది ప్రేమ వివాహమా?

ఈ ఘటనపై లోకేష్ మాట్లాడుతూ.. నేనప్పుడు యూరప్ లో ఉన్నాను. ఎర్లీ మార్కింగ్ ఫోన్ వచ్చింది. నేను షాక్ లో ఉన్నా. అమ్మ ఫోన్ చేసి నాన్న గారు బాగున్నారు అని చెప్పేవరకు నేను భయపడుతూనే ఉన్నాను అని తెలిపారు.