Chandrababu Naidu: దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు నాయుడు
మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తన 73వ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ఉదయం ఇంద్రకీలాదిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, సిబ్బంది...

Chandrababu Nadiu
Chandrababu Naidu : మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తన 73వ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. జన్మదినోత్సవం సందర్భంగా వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం ఆలయ ఈవో భ్రమరాంబ అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను చంద్రబాబుకు బహుకరించారు. చంద్రబాబు వెంట ఎంపీలు కేశినేని నాని, కనకమేడల, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమ, బుద్ధా వెంకన్నలు ఉన్నారు. అమ్మవారి దర్శనం అనంతరం చంద్రబాబు మాట్లాడారు.. తనకు, ప్రజలకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని చెప్పారు. అంతేకాక తనకు ప్రజల పక్షాన పోరాడేందుకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, ప్రజల ఇబ్బందులు తొలగించాలని వేడుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. తెలుగు జాతికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని, తాను తప్పకుండా జయం సాధిస్తాననే నమ్మకం ఉందని, రాజీలేని పోరాటంతో ప్రజలకు అండగా నిలబడతానని చంద్రబాబు చెప్పారు.
Chandrababu Naidu Birthday: 73వ ఏట అడుగుపెట్టిన చంద్రబాబు.. ఘనంగా వేడుకలు!
ఇదిలా ఉంటే చంద్రబాబు జన్మదినం సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు రాష్టంలోని వివిధ ప్రాంతాల నుండి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు టీడీపీ కేంద్ర కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. 73 కేజీల కేక్‌ను ఏర్పాటు చేశారు. అలాగే 73 అడుగుల పూల దండ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బుధవారం ఉదయం నుంచి పలువురు ప్రముఖులు నేరుగా, ఫోన్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా చంద్రబాబు నాయుడుకు పుట్టిరోజు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయుడుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడు ఆశీస్సులు అందించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. అదేవిధంగా పలువురు తెదేపా నాయకులు, జాతీయ, రాష్ట్రంలోని వివిధ పార్టీల నాయకులు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.