Chandrababu Naidu: ఏపీ సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్విటర్ వేదికగా.. ఇది కూల్చివేతల ప్రభుత్వమంటూ విమర్శించారు. ప్రజా వేదిక విధ్వంసానికి మూడేళ్లు అని, తన సైకో పాలన ఎలా ఉండబోతోందో ప్రజలకు చెప్పడానికి అధికారంలోకి రాగానే జగన్ చేసిన మొట్టమొదటి పని ప్రజావేదిక కూల్చివేతే అంటూ చంద్రబాబు గుర్తు చేశారు.

Chandrababu Naidu: ఏపీ సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu

Chandrababu Naidu: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్విటర్ వేదికగా.. ఇది కూల్చివేతల ప్రభుత్వమంటూ విమర్శించారు. ప్రజా వేదిక విధ్వంసానికి మూడేళ్లు అని, తన సైకో పాలన ఎలా ఉండబోతోందో ప్రజలకు చెప్పడానికి అధికారంలోకి రాగానే జగన్ చేసిన మొట్టమొదటి పని ప్రజావేదిక కూల్చివేతే అంటూ చంద్రబాబు గుర్తు చేశారు. కోట్ల విలువైన ప్రజల ఆస్తిని ధ్వంసం చేస్తూ.. తన ఆలోచనలు ఎలా ఉంటాయో రాష్ట్రానికి సీఎం జగన్ వివరించి నేటికి మూడేళ్లు అవుతుందని ఎద్దేవా చేశారు.

AP Politics: అప్పుడు తేలిపోద్ది పులి ఎవడో.. పిల్లి ఎవడో!.. విజయసాయికి అయ్యన్న పాత్రుడు కౌంటర్

కూల్చివేతలే తప్ప జగన్ కు నిర్మాణం చేతకాదని చంద్రబాబు విమర్శించారు. ఏపీ అభివృద్ధిని కూల్చాడని, రాష్ట్ర ఆర్థిక స్థాయిని కూల్చాడని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కూల్చాడంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు. దళితుల గూడును, యువత భవితను, ప్రజారాజధాని అమరావతిని, పోలవరం కలను కూల్చి రాష్ట్రానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేశాడంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజావేదిక కూల్చి వికృతానందం పొందిన జగన్.. మూడేళ్లలో కట్టింది మాత్రం శూన్యం అన్నారు. గత ప్రభుత్వం కట్టిన నిర్మాణాల్లోనే పాలన చేస్తూ.. తన వల్ల ఏమీ కాదని.. తనకు ఏమీ రాదని సీఎం జగన్ తేల్చి చెప్పేశాడని చంద్రబాబు అన్నారు. కూల్చడం కంటే నిర్మించడం ఎంత కష్టమైన పనో మూడేళ్ల పాలన తరువాత అయినా జగన్ తెలుసుకోవాలంటూ చంద్రబాబు హితవు పలికారు.