టీడీపీ నేత ఓటర్ రామకృష్ణ మృతికి సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ సంతాపం

ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నె రామకృష్ణ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

టీడీపీ నేత ఓటర్ రామకృష్ణ మృతికి సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ సంతాపం

CM Chandrababu Naidu

Updated On : July 14, 2024 / 11:26 AM IST

CM Chandrababu Naidu : ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్నె రామకృష్ణ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామకృష్ణ హఠాన్మరణం తనను షాక్ కు గురిచేసిందని, తెలుగుదేశం పార్టీలో కీలకమైన ఓటర్ వెరిఫికేషన్ విభాగంలో రామకృష్ణ ఎంతో క్రియాశీలకంగా, సమర్థవంతంగా పనిచేశారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఓటర్ వెరిఫికేషన్లో మంచి అనుభవం ఉన్న రామకృష్ణను అంతా ఓటర్ రామకృష్ణగా పిలిచేవారు. రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు తెలిపారు.

Also Read : Donald Trump : డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..

రామకృష్ణా మృతిపట్ల నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామకృష్ణ అన్న హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.‌ టీడీపీకోసం అహర్నిశలు శ్రమించిన ఓటర్ రామకృష్ణ అన్నకు అశ్రునివాళులు అర్పిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఓటర్ వెరిఫికేషన్ విభాగానికి ఎనలేని సేవలందించారంటూ ఓటర్ రామకృష్ణ తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలను నారా లోకేశ్ గుర్తు చేసుకున్నారు.