Cm Chandrababu: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. రూ.15వేలు డబ్బులు పడే డేట్, టైమ్ చెప్పిన సీఎం చంద్రబాబు..
ఏదైనా కారణాల వల్ల లబ్దిదారుల జాబితాలో ఎవరి పేరైనా లేకపోతే.. వారి సమస్యలను పరిష్కరించి వారినీ లబ్దిదారుల జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారు.

Cm Chandrababu: ఏపీలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఆటో డ్రైవర్ సేవలో స్కీమ్ కింద రూ.15వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తామన్నారు. ఈ స్కీమ్ అమలుకు సంబంధించి డేట్, టైమ్ ని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అక్టోబర్ 4వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఆటో డ్రైవర్ సేవలో స్కీమ్ ని ప్రారంభిస్తామన్నారు.
ఆ వెంటనే అర్హుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంటామన్నారు. పెండింగ్ చలాన్లు, ఫిట్ నెస్ సర్టిఫికెట్ క్లియర్ చేసుకున్న వారికి ఆర్థిక సాయం అందుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తం 2.9 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఏటా రూ.15వేల చొప్పున అందిస్తామన్నారు.
సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీల అమలుపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఇందులో భాగంగా మరో సంక్షేమ కార్యక్రమాన్ని ప్రకటించారు. అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ సేవలో’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.
”అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఆటో డ్రైవర్ సేవలో పేరుతో ప్రతి ఏడాది రూ.15 వేలు ఇస్తాం. 2లక్షల 90వేల 234 మంది డ్రైవర్లు.. ఆటో డ్రైవర్ సేవలో పథకంలో లబ్దిదారులుగా ఉన్నారు. ఏదైనా కారణాల వల్ల లబ్దిదారుల జాబితాలో ఎవరి పేరైనా లేకపోతే.. వారి సమస్యలను పరిష్కరించి వారినీ లబ్దిదారుల జాబితాలో చేరుస్తాం” అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఆటో, క్యాబ్ (మ్యాక్సీ, మోటార్) డ్రైవర్లకు ఆటో డ్రైవర్ సేవలో స్కీమ్ ను వర్తింప చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ పథకానికి రూ.435 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రూ.12 వేలు మాత్రమే ఇచ్చేది.. మేము రూ.15వేలు ఇస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
”అక్టోబర్ 2న పేదల సేవలో కార్యక్రమం ఉంది. చాలా ఆలోచించి పేదల సేవలో అనే పేరు పెట్టాం. ప్రతి నెల ఫించన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతృప్తినిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయి. అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తాం. నాడు చెప్పాం.. నేడు చేసి చూపుతున్నాం” అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read: ఏపీలో మహిళలకు నెలకు రూ.1500.. ఆ స్కీమ్ పై మంత్రి కీలక ప్రకటన.. అమలు ఎప్పటి నుంచి అంటే..