Cm Chandrababu: ఏపీకి ఆ హక్కు ఉంది.. అమిత్ షాతో భేటీలో బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు చర్చ

అమిత్ షా తో సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కోరారు.

Cm Chandrababu: ఏపీకి ఆ హక్కు ఉంది.. అమిత్ షాతో భేటీలో బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు చర్చ

Updated On : July 15, 2025 / 8:32 PM IST

Cm Chandrababu: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆయనతో సమావేశం అయ్యారు. సుమారు 40 నిమిషాలు అమిత్ షా తో చర్చలు జరిపారు చంద్రబాబు.

పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గర ప్రస్తావించారు ఏపీ సీఎం చంద్రబాబు. అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనలను వివరించారు. గోదావరి మిగులు జలాలను గోదావరి పరివాహకంలోని చివరి రాష్ట్రంగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని తెలిపారు. గోదావరి నదిలో ఎగువ, దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చినా ఇంకా 90 నుంచి 120 రోజులు మిగులు నీరు ఉందని అమిత్ షాకు వివరించారు. ఇక 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా బనకచర్ల ప్రాజెక్ట్ ప్రణాళిక చేసినట్లు అమిత్ షాకు తెలిపారు.

Also Read: ఏపీలో పదవుల జాతర..! మరో విడత నామినేటెడ్ పోస్టులకు ముహూర్తం ఫిక్స్..!?

అమిత్ షా తో సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కోరారు. ఇక అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టును 82వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదించామని, గోదావరి మిగులు జలాలను వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని చంద్రబాబు వివరించారు. అమిత్ షాతో సమావేశం అనంతరం మరో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.