పరవాడ ఫార్మా సిటీ ఘటన.. సీఎం చంద్రబాబు సీరియస్..

వారితో ఫోన్ లో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పరవాడ ఫార్మా సిటీ ఘటన.. సీఎం చంద్రబాబు సీరియస్..

Updated On : November 27, 2024 / 6:15 PM IST

Visakha Pharma City Incident : పరవాడ ఫార్మా సిటీలో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. బాధితులకు అందుతున్న చికిత్సపై ఆయన ఆరా తీశారు. గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. బాధితులకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఫార్మా సిటీలో విషవాయువు లీకై ఒకరు మృతి చెందగా, ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై హోంమంత్రి అనిత కూడా సీరియస్ అయ్యారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా.. పరిశ్రమల యజమానులు తగిన చర్యలు తీసుకోవడం లేదని, నిబంధనలను పాటించడం లేదని హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు.

పరవాడ ఫార్మా సిటీలో జరిగిన ప్రమాదం తీరుపై అధికారులను ఆరా తీశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వారితో ఫోన్ లో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగింది? గాయపడ్డ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? వారికి ఎటువంటి వైద్యం అందిస్తున్నారు? తదితర అంశాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. ప్రభుత్వ పరంగా బాధితులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై జిల్లా యంత్రాంగం, సంబంధిత శాఖ మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

ఫార్మా సిటీలో జరిగిన ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత సైతం స్పందించారు. ఠాగూర్ ల్యాబోరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో విషవాయువు లీక్ కావడం పట్ల ఆమె సీరియస్ అయ్యారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు ఆదేశాలు ఇచ్చినా.. కంపెనీ నిర్లక్ష్య వైఖరి స్పష్టం కనిపిస్తోందని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన వారిపైన, యాజమాన్యం నిర్లక్ష్యంపైన దర్యాఫ్తు జరిపి కఠినమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

 

Also Read : ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు..! ఆ రెండు ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్..