10మంది ఎమెల్యేలు రౌడీలు.. ఏరి పారేయాల్సిందే : టీడీపీపై సీఎం జగన్ ఫైర్
బుధవారం(జనవరి 22,2020) ప్రారంభమైన అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున

బుధవారం(జనవరి 22,2020) ప్రారంభమైన అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున
బుధవారం(జనవరి 22,2020) ప్రారంభమైన అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. స్పీకర్ ఎంత నచ్చ చెప్పినా వారు వినిపించుకోలేదు. పోడియం చుట్టుముట్టి నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎమ్మెల్యేలా? వీధి రౌడీలా? అని సీఎం జగన్ మండిపడ్డారు. టీడీపీ సభ్యులు రౌడీలకన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
సభ సజావుగా జరక్కుండా టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. సభలోకి మార్షల్స్ ను పిలిపించాలని స్పీకర్ ను కోరిన సీఎం జగన్.. టీడీపీ ఎమ్మెల్యేలు హద్దు మీరితే సభ నుంచి బలవంతంగా బయటకు గెంటేయాలని కోరారు. టీడీపీ సభ్యులు 10మంది కూడా లేరన్నారు జగన్. మేము 151 మంది ఉన్నా ఓపిగ్గా వింటున్నామని చెప్పారు. మా సభ్యులు రెచ్చిపోయి దాడి చేయాలని టీడీపీ సభ్యులు కుట్ర చేశారని జగన్ ఆరోపించారు.
సీఎం జగన్ ఫైర్:
* అసెంబ్లీలో గందరగోళం
* స్పీకర్ పోడియం చుట్టుముట్టి టీడీపీ సభ్యుల నినాదాలు
* టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్ ఆగ్రహం
* మీరు ఎమ్మెల్యేలా? వీధి రౌడీలా? అని జగన్ మండిపాటు
* సమాజంలో రౌడీలను ఏరిపారేయాల్సిందే
* స్పీకర్ చైర్ దగ్గర గొడవ చేయడం దారుణం
* మీరు 10మంది కూడా లేరు
* ఇటు వైపు 151మంది ఉన్నారు
* మా వాళ్లు ఎంతో ఓపిగ్గా ఉన్నారు
* టీడీపీ సభ్యులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు
* స్పీకర్ చైర్ చుట్టూ గుమిగుడారు, స్పీకర్ ను అగౌరవ పరుస్తున్నారు
* రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు.. రెచ్చగొడితే రెచ్చిపోకుండా ఎలా ఉంటాం
* టీడీపీ సభ్యులు సంస్కారం లేని వ్యక్తులు
* అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో తెలియదు
* చేతనైతే సలహాలు ఇవ్వండి లేదంటే అసెంబ్లీ బయటే ఉండండి
* దిక్కుమాలిన పార్టీ, దిక్కుమాలిన ఎమ్మెల్యేలు
* రింగ్ దాటి లోపలికి వస్తే మార్షల్స్ ని రంగంలోకి దింపుతా
* వెంటనే మార్షల్స్ ని పిలవండి.. రింగ్ ఫార్మ్ చేయండి
* స్పీకర్ కుర్చీ మెట్లు ఎక్కకుండా మార్షల్స్ పెట్టాలి
* టీడీపీ ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు
* మీకన్నా రౌడీలు నయం
* వీధి రౌడీలను ఏరివేయకపోతే వ్యవస్థ బాగుపడదు
* టీడీపీ సభ్యులు హద్దు మీరితే సభ నుంచి బయటకు విసిరేయండి
* 10మంది ఉన్నారు.. రౌడీల్లా వ్యవహరిస్తున్నారు
Also Read : 3 రాజధానులు అడ్డుకోవడానికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్