Andhra Pradesh: ఏపీ గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన సీఎం జగన్.. బుధవారమే ఏపీకి రానున్న నూతన గవర్నర్

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు గన్నవరం విమానాశ్రయంలో ఏపీ సీఎం జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఇతర ఉన్నతాధికారులు, నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.

Andhra Pradesh: ఏపీ గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన సీఎం జగన్.. బుధవారమే ఏపీకి రానున్న నూతన గవర్నర్

Updated On : February 22, 2023 / 1:49 PM IST

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పని చేసిన బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఏపీ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. ఆయనను కేంద్రం చత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం ఉదయం చత్తీస్‌ఘడ్ బయల్దేరి వెళ్లారు.

Andhra Pradesh: తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే పిల్లలకు గుణపాఠం.. వృద్ధురాలైన తల్లిని వేధిస్తున్న కొడుకు, కోడలికి జైలు శిక్ష

ఈ సందర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్‌కు గన్నవరం విమానాశ్రయంలో ఏపీ సీఎం జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఇతర ఉన్నతాధికారులు, నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. వీడ్కోలు సందర్భంగా సీఎం జగన్ గవర్నర్ పాదాలకు నమస్కరించడం విశేషం. అంతకుముందు మంగళవారం విజయవాడలో గవర్నర్ వీడ్కోలు కార్యక్రమాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కూడా సీఎం జగన్, అధికారులు, నేతలు హాజరయ్యారు.

ANDHRA PRADESH: ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

బిశ్వభూషణ్ హరిచందన్‌తో తమకున్న అనుబంధాన్ని జగన్ సహా నేతలు గుర్తు చేసుకున్నారు. ఆయన రాష్ట్రాభివృద్ధికి సహకరించిన తీరుపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు ఏపీ నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్‌ బుధవారమే రాష్ట్రానికి రానున్నారు. బుధవారం సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి ఏపీ చేరుకుంటారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 24, శుక్రవారం జస్టిస్ అబ్దుల్ నజీర్‌ ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.