AP CM Jagan: నేడు ప్రధాని మోదీతో భేటీకానున్న ఏపీ సీఎం జగన్ ..

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భేటీ అవుతారు. ఇందుకోసం జగన్ మంగళవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. 

AP CM Jagan: నేడు ప్రధాని మోదీతో భేటీకానున్న ఏపీ సీఎం జగన్ ..

AP CM Jagan

Updated On : December 28, 2022 / 11:21 AM IST

AP CM Jagan: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. మంగళవారం రాత్రి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన.. అక్కడినుంచి నేరుగా అధికారిక నివాసానికి వెళ్లారు. ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో జగన్‌మోహన్ రెడ్డి భేటీ అవుతారు. అనంతరం కేంద్ర మంత్రులతో జగన్ భేటీ అవుతారు. మధ్యాహ్నం 2గంటలకు భూపేందర్ యాదవ్‌తో భేటీకానున్న సీఎం జగన్.. రాత్రి 10గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.

CM Jagan: ఢిల్లీకి బయల్దేరిన జగన్… మోదీతో రేపు సమావేశం

ముఖ్యమంత్రితోపాటు వైసీపీ పార్లమెంటరీ నేత వి. విజయసాయిరెడ్డి, పార్టీ లోక్‌సభా పక్షనేత మిథున్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ప్రధానితో భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై మోదీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఏపీ విభజన చట్టానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని ప్రధానిని జగన్ కోరానున్నారు.

AP CM Jagan: బుధవారం ఢిల్లీకి ఏపీ సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ

తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రూ.6వేలకోట్లకుపైగా నిధులు రావాల్సి ఉంది. ఈ నిధులను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఇటీవల సూచించింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమదైన వాదన వినిపిస్తోంది. ఈ అంశంపైనా జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అదేవిధంగా బీచ్ శాండ్ మైనింగ్, కడప స్టీల్ ప్లాంట్, తదితర అంశాలపై సీఎం జగన్ ప్రధాని వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది.