ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Corona cases reduced : ఆంధ్రప్రదేశ్ లో భారీగా కరోనా కేసులు తగ్గాయి. వేల సంఖ్య నుంచి వందల సంఖ్యకు పడిపోయాయి. ఏపీలో కొత్తగా 753 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంట్లలో 13 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,54,074కి చేరింది. ఇప్పటివరకు 6,881 మంది మృతి చెందారు. ఈ మేరకు సోమవారం నవంబర్ (16, 2020) వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరు 2, కృష్ణా 2, విశాఖ 2, అనంతపురం 1, తూర్పుగోదావరి1, గుంటూరు 1, నెల్లూరు 1, శ్రీకాకుళం 1, విజయనగరం 1, పశ్చిమగోదావరి 1 చొప్పున మొత్తం 13 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 6,881 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 43,044 శాంపిల్స్ పరీక్షించారు.
ఒక్కరోజులో కరోనా నుంచి కోలుకుని 1,507 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 8,29,991 మంది డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రంలో 17,892 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో 91,97,307 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.