కరోనా డస్ట్ బిన్స్…కోవిడ్ కట్టడికి విజయవాడ కార్పొరేషన్ చర్యలు

  • Published By: bheemraj ,Published On : July 25, 2020 / 08:56 PM IST
కరోనా డస్ట్ బిన్స్…కోవిడ్ కట్టడికి విజయవాడ కార్పొరేషన్ చర్యలు

Updated On : July 25, 2020 / 8:57 PM IST

విజయవాడ కార్పొరేషన్ అధికారులు కరోనా కట్టడి చర్యలు ముమ్మరం చేశారు. కోవిడ్ పై అవగాహన కల్పించటానికి కరోనా వైరస్ డస్ట్ బిన్ ఏర్పాటు చేశారు. కరోనా ఆకారంలో డస్ట్ బిన్ ను ఏర్పాటు చేసి మాస్కులు, గ్లౌజులు దీనిలోనే వెయ్యాలని తెలుపుతున్నారు. వాడేసిన ఫేస్ మాస్కులు, ఇతర రక్షణ వస్తువులను రోడ్డుపై పడేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. నగర వ్యాప్తంగా ఇప్పటికే 21 కంటైన్ మెంట్ జోన్లను ప్రకటించి, కఠినమైన ఆంక్షలు కొనసాగిస్తున్నారు.

విజయవాడలో కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. అయితే ప్రస్తుతం కార్పొరేషన్ అధికారులు కరోనా నివారణ చర్యల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. కోవిడ్ వైరస్ డస్ట్ బిన్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు మాస్కులు, గ్లౌజులు వాడేసిన తర్వాత వాటిని రోడ్డుపై పడేస్తున్నారు. ఒకవేళ పాజిటివ్ కేసులుంటే కనుక వారి ద్వారా ఇతరులకు వ్యాధి సక్రమించే ప్రమాదం ఉంది. కనుక విజయవాడ నగర వ్యాప్తంగా 21 చోట్ల డిస్పోజ్ యూజ్డ్ మాస్క్ హియర్ అనే పేరుతో కరోనా ఆకారంలో డస్ట్ బిన్స్ తయారు చేశారు.

బస్టాండ్, రైతు బజార్ తోపాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కరోనా తీవ్రత పెరుగుతున్న క్రమంలో కూడా జనాలు విపరీతంగా రోడ్లపైకి వస్తున్నారు. ఇటువంటి సందర్బంలో మాస్కులు, గ్లౌజులు కూడా రోడ్లపై పడేస్తున్నారు. అలా కాకుండా వాటిని కరోనా డస్ట్ బిన్ లో మాత్రమే వేయాలని సూచన చేస్తున్నారు. కరోనా కట్టడికి సహకరించాలని కోరుతున్నారు.